Eppudoo meerokkade yelaminemchi sooside

ఎప్పుడూ మీరొక్కటే యెలమినెంచి చూచితే
Language

(॥పల్లవి॥)
ఎప్పుడూ మీరొక్కటే యెలమినెంచి చూచితే
ముప్పిరి మీ వూడిగాన కప్పణియ్యరయ్యా

(॥॥)
చెంగట నీసుద్దులెల్లఁ జెలితో విన్నవింతుము
అంగనమాటలు నీతో నాడుదుము
యెంగిలిపొత్తువారము యిద్దరియెడకు నేము
వుంగిట నేమేమనినా నోరుచుకోరయ్యా

(॥॥)
అలరి నీవిచ్చినట్టి ఆనవాలాకెకిత్తుము
నెలఁతచే కానికెలు నీకిత్తుము
వొలిసి మీకిద్దరికి నూడిగవు చుట్టాలము
తలఁచి మాచేఁతలు తాళుకొనరయ్యా

(॥॥)
శ్రీ వేంకటేశ్వర నీకు సేస చేతికందిత్తుము
దేవులీకె చెప్పితేను తెర వేతుము
యీవల మిమ్మిద్దరి నెనయించినవారము
వోవరిలో మీసేవలు వొప్పుగొనరయ్యా

(||pallavi||)
ĕppuḍū mīrŏkkaḍe yĕlaminĕṁchi sūside
muppiri mī vūḍigāna kappaṇiyyarayyā

(||||)
sĕṁgaḍa nīsuddulĕllam̐ jĕlido vinnaviṁtumu
aṁganamāḍalu nīdo nāḍudumu
yĕṁgilibŏttuvāramu yiddariyĕḍagu nemu
vuṁgiḍa nememaninā norusugorayyā

(||||)
alari nīvichchinaṭṭi ānavālāgĕgittumu
nĕlam̐tase kānigĕlu nīgittumu
vŏlisi mīgiddarigi nūḍigavu suṭṭālamu
talam̐si māsem̐talu tāḽugŏnarayyā

(||||)
śhrī veṁkaḍeśhvara nīgu sesa sedigaṁdittumu
devulīgĕ sĕppidenu tĕra vedumu
yīvala mimmiddari nĕnayiṁchinavāramu
vovarilo mīsevalu vŏppugŏnarayyā