ఎప్పుడయ్యా నీ కరుణ యింతిమీఁదను
(॥పల్లవి॥)
ఎప్పుడయ్యా నీ కరుణ యింతిమీఁదను
చిప్పిలు చెక్కులునిండాఁ జెమటలు నించెను
(॥॥)
వెక్కసపు వలపులు విన్నవించరాక చెలి
లెక్కించి తమ్మి రేకుల లేకలంపెను
జక్కవ చన్నులనొత్త సారె సారె సిగ్గువడి
ముక్కరగదల ముసిముసినవ్వు నవ్వెను
(॥॥)
అంతరంగములో యాస లడ్డపెట్టరాక సతి
కాంతాళమున చెలిక త్తెనంపెను
పంతపుమాటల మోవి బల్లుమోప సిగ్గువడి
చెంతలఁ గొప్పు వీడఁగ సేస నీపైఁ బెట్టెను
(॥॥)
వేడుక కాఁగిటిరతి వెలవెట్టలేక యింతి
నీడ చూచే యద్దము కానికె యంపెను
యీడుగా శ్రీవేంకటేశ యీకె నిట్టే కూడితివి
జాడతోఁ బయ్యద జార సన్న నీకుజేసెను
(||pallavi||)
ĕppuḍayyā nī karuṇa yiṁtimīm̐danu
sippilu sĕkkuluniṁḍām̐ jĕmaḍalu niṁchĕnu
(||||)
vĕkkasabu valabulu vinnaviṁcharāga sĕli
lĕkkiṁchi tammi regula legalaṁpĕnu
jakkava sannulanŏtta sārĕ sārĕ sigguvaḍi
mukkaragadala musimusinavvu navvĕnu
(||||)
aṁtaraṁgamulo yāsa laḍḍabĕṭṭarāga sadi
kāṁtāḽamuna sĕliga ttĕnaṁpĕnu
paṁtabumāḍala movi ballumoba sigguvaḍi
sĕṁtalam̐ gŏppu vīḍam̐ga sesa nībaim̐ bĕṭṭĕnu
(||||)
veḍuga kām̐giḍiradi vĕlavĕṭṭalega yiṁti
nīḍa sūse yaddamu kānigĕ yaṁpĕnu
yīḍugā śhrīveṁkaḍeśha yīgĕ niṭṭe kūḍidivi
jāḍadom̐ bayyada jāra sanna nīgujesĕnu