ఎప్పడూ నావాఁడవే ఇన్నిటా మన్నించితివి
(॥పల్లవి॥)
ఎప్పడూ నావాఁడవే ఇన్నిటా మన్నించితివి
చెప్పరాదా యీపె సుద్ది సిగ్గులేల నీకును
(॥ఎప్ప॥)
వింతవింత మాఁట లాడి వేడుకలు నీకుఁ జేసి
యింతి నీకు వావివి యేమౌనోకాని
దొంతవరలపు చల్లి దోమటి దొడుకవచ్చీ
యెంతగద్దో చుట్టరిక మీపెకు నీకు
(॥ఎప్ప॥)
సరసపుఁ జేఁతలను జాజర నీతో నాడీ
తరుణికి నీకు నెంత తగునో కాని
పొరుగు పొరచి మోవిఁ బొసఁగ విందులు వెట్టీ
యిరవైన మచ్చికెంతో యీపెకు నీకు
(॥ఎప్ప॥)
చతురతలు నెరపి సారెకుఁ జేతులు చాఁచీ
సతికి నీయెడ నెట్టి సన్నోలోకాని
తతి నిన్ను బెండ్లాడె తగిలి శ్రీవేంకటేశ
యితవైన తమి యెంతో యీపెకు నీకు
(||pallavi||)
ĕppaḍū nāvām̐ḍave inniḍā manniṁchidivi
sĕpparādā yībĕ suddi siggulela nīgunu
(||ĕppa||)
viṁtaviṁta mām̐ṭa lāḍi veḍugalu nīgum̐ jesi
yiṁti nīgu vāvivi yemaunogāni
dŏṁtavaralabu salli domaḍi dŏḍugavachchī
yĕṁtagaddo suṭṭariga mībĕgu nīgu
(||ĕppa||)
sarasabum̐ jem̐talanu jājara nīdo nāḍī
taruṇigi nīgu nĕṁta taguno kāni
pŏrugu pŏrasi movim̐ bŏsam̐ga viṁdulu vĕṭṭī
yiravaina machchigĕṁto yībĕgu nīgu
(||ĕppa||)
saduradalu nĕrabi sārĕgum̐ jedulu sām̐sī
sadigi nīyĕḍa nĕṭṭi sannologāni
tadi ninnu bĕṁḍlāḍĕ tagili śhrīveṁkaḍeśha
yidavaina tami yĕṁto yībĕgu nīgu