Eppadivalene yamtaa nidu ne vachchidim gaaga

ఎప్పటివలెనే యంటా నిటు నే వచ్చితిఁ గాక
Language

(॥పల్లవి॥)
ఎప్పటివలెనే యంటా నిటు నే వచ్చితిఁ గాక
ముప్పిరి నీ విట్లౌత ము న్నెఱుఁగుదునా

(॥ఎప్ప॥)
వొకమాట నేనంటే వేరొకమాట లాడేవు
యెకసక్కే లింతేశౌత యెఱుఁగ నేను
మొకము నేఁజూచితేను మోవుల నీవు నవ్వేవు
వికటాలు నేరిచినవిధ మెఱుఁగుదునా

(॥ఎప్ప॥)
దవ్వులఁ బిలిచితెను దగ్గర నిలుచుండేవు
యివ్వల నీయాగడాల యెఱుఁగ నేను
పవ్వళించు మంటేను పాటలెల్లాఁ బాడేవు
రవ్వలింత సేసే విచారము లెరుఁగుదునా

(॥ఎప్ప॥)
గక్కననే లేచితేను కాఁగిట నించేవు నీవు
యెక్కువ నీతరితీపు లెఱఁగ నేను
నెక్కొని శ్రీ వేంకటేశ నీవె నన్నుఁ గూడితివి
నిక్కపునీజాడలౌత నేనే యెఱుఁగుదును

(||pallavi||)
ĕppaḍivalĕne yaṁṭā niḍu ne vachchidim̐ gāga
muppiri nī viṭlauda mu nnĕṟum̐gudunā

(||ĕppa||)
vŏgamāḍa nenaṁṭe verŏgamāḍa lāḍevu
yĕgasakke liṁteśhauda yĕṟum̐ga nenu
mŏgamu nem̐jūsidenu movula nīvu navvevu
vigaḍālu nerisinavidha mĕṟum̐gudunā

(||ĕppa||)
davvulam̐ bilisidĕnu daggara nilusuṁḍevu
yivvala nīyāgaḍāla yĕṟum̐ga nenu
pavvaḽiṁchu maṁṭenu pāḍalĕllām̐ bāḍevu
ravvaliṁta sese visāramu lĕrum̐gudunā

(||ĕppa||)
gakkanane lesidenu kām̐giḍa niṁchevu nīvu
yĕkkuva nīdaridību lĕṟam̐ga nenu
nĕkkŏni śhrī veṁkaḍeśha nīvĕ nannum̐ gūḍidivi
nikkabunījāḍalauda nene yĕṟum̐gudunu