Eppadivalene seli nelavayyaa

ఎప్పటివలెనే చెలి నేలవయ్యా
Language

(॥పల్లవి॥)
ఎప్పటివలెనే చెలి నేలవయ్యా
చిప్పిలుఁ జెమటతోడ సిగ్గువడనేలా

(॥॥)
వేడుకగల సతులు వేవేలు నాడుదురు
పాడివెట్టి నీకు నెగ్గు పట్టనేఁటికే
వాడికెగలయింతులు వరుసలు మీరుదురు
యీడ నిట్టే తలవంచ నేఁటికి నీకు

(॥॥)
సలిగెగల కాంతలు జాగుల నెలయింతురు
అలసి యింతలో నుస్సురననేలా
వలచిన మగువలు వడిగాఁ బెనఁగుదురు
పలుమారు నీకు బెండువడ నేఁటికి

(॥॥)
సేసవెట్టిన లేమలు చెక్కు గోర గీరుదురు
బేసబెల్లి తనానఁ దప్పించుకో నేలా
ఆసతో శ్రీవేంకటేశ ఆకే నీవూఁ గూడితిరి
బాసిచ్చితి నని నీవు పలుకఁగ వలెనా

(||pallavi||)
ĕppaḍivalĕne sĕli nelavayyā
sippilum̐ jĕmaḍadoḍa sigguvaḍanelā

(||||)
veḍugagala sadulu vevelu nāḍuduru
pāḍivĕṭṭi nīgu nĕggu paṭṭanem̐ṭige
vāḍigĕgalayiṁtulu varusalu mīruduru
yīḍa niṭṭe talavaṁcha nem̐ṭigi nīgu

(||||)
saligĕgala kāṁtalu jāgula nĕlayiṁturu
alasi yiṁtalo nussurananelā
valasina maguvalu vaḍigām̐ bĕnam̐guduru
palumāru nīgu bĕṁḍuvaḍa nem̐ṭigi

(||||)
sesavĕṭṭina lemalu sĕkku gora gīruduru
besabĕlli tanānam̐ dappiṁchugo nelā
āsado śhrīveṁkaḍeśha āge nīvūm̐ gūḍidiri
bāsichchidi nani nīvu palugam̐ga valĕnā