ఎప్పటివలెనే చన వియ్య రాదా
(॥పల్లవి॥)
ఎప్పటివలెనే చన వియ్య రాదా
తప్పులేని సతి నింక దయఁ జూడ రాదా
(॥ఎప్పటి॥)
నాలితో నాపె నిన్ను నవ్వుతా నన్న మాఁటకు
యేల కోపగించుకొనే వింతలోనే
మీలోనే యిటు లైతే మెత్తురా లోకమువారు
తాలిమితో నింతి నింక దయఁ జూడ రాదా
(॥ఎప్పటి॥)
చనవు చేసుక యాపె జంకించనయందుకు
యెన లేక చిన్నఁ బొయ్యే వేఁటికి నీవు
కొనగొన మీకు మీకు కోపము లింత చెల్లువా
తనిసి నీ దేవులను దయఁ జూడ రాదా
(॥ఎప్పటి॥)
చుట్టరికమున నాపె సూడు వట్టినందుకు
యెట్టు పెనఁగఁ బోయి నితవు లవునా
యిట్టె శ్రీవెంకటేశ యింతలోఁ గూడితి వీపెఁ
దట్టు ముట్ట సేయ కిట్టె దయఁ జూడ రాదా
(||pallavi||)
ĕppaḍivalĕne sana viyya rādā
tappuleni sadi niṁka dayam̐ jūḍa rādā
(||ĕppaḍi||)
nālido nābĕ ninnu navvudā nanna mām̐ṭagu
yela kobagiṁchugŏne viṁtalone
mīlone yiḍu laide mĕtturā logamuvāru
tālimido niṁti niṁka dayam̐ jūḍa rādā
(||ĕppaḍi||)
sanavu sesuga yābĕ jaṁkiṁchanayaṁdugu
yĕna lega sinnam̐ bŏyye vem̐ṭigi nīvu
kŏnagŏna mīgu mīgu kobamu liṁta sĕlluvā
tanisi nī devulanu dayam̐ jūḍa rādā
(||ĕppaḍi||)
suṭṭarigamuna nābĕ sūḍu vaṭṭinaṁdugu
yĕṭṭu pĕnam̐gam̐ boyi nidavu lavunā
yiṭṭĕ śhrīvĕṁkaḍeśha yiṁtalom̐ gūḍidi vībĕm̐
daṭṭu muṭṭa seya kiṭṭĕ dayam̐ jūḍa rādā