(॥పల్లవి॥)
ఎప్పటివలెఁ గావు యేతులు
యిప్పుడింతటిలోనే యెవ్వతె నేరిపెనే
(॥ఎప॥)
గురువుతోనే చూపే గుట్లు
వరుసవంతుల తన వట్టిరట్లు
తెరమరఁగు పెదవితిట్లు
యిరవుగఁ దనకిది యెవ్వతె నేరిపెనే
(॥ఎప॥)
పెనఁగేటి తన మేని బిగువులు
వనితలతోఁ జెప్పే చేవతగవులు
ననుపుల సెలవుల నగవులు
యెనలేక తనకిది యెవ్వతె నేరిపెనే
(॥ఎప॥)
పిక్కటిల్లుఁ గాగిటిలో బీరాలు
పక్కన సరసములోఁ బలుబేరాలు
యిక్కువై శ్రీ వేంకటేశుఁడేలెను నన్ను
యెక్కుడుగ నేఁడు తనకెవ్వతె నేరిపెనే
(||pallavi||)
ĕppaḍivalĕm̐ gāvu yedulu
yippuḍiṁtaḍilone yĕvvadĕ neribĕne
(||ĕba||)
guruvudone sūbe guṭlu
varusavaṁtula tana vaṭṭiraṭlu
tĕramaram̐gu pĕdavidiṭlu
yiravugam̐ danagidi yĕvvadĕ neribĕne
(||ĕba||)
pĕnam̐geḍi tana meni biguvulu
vanidaladom̐ jĕppe sevadagavulu
nanubula sĕlavula nagavulu
yĕnalega tanagidi yĕvvadĕ neribĕne
(||ĕba||)
pikkaḍillum̐ gāgiḍilo bīrālu
pakkana sarasamulom̐ baluberālu
yikkuvai śhrī veṁkaḍeśhum̐ḍelĕnu nannu
yĕkkuḍuga nem̐ḍu tanagĕvvadĕ neribĕne