Eppadivale numdare yeravulu meegela

ఎప్పటివలె నుండరే యెరవులు మీకేల
Language

(॥పల్లవి॥)
ఎప్పటివలె నుండరే యెరవులు మీకేల
కుప్పలుఁదెప్పలునాయ గురుతైన వలపు

(॥ఎప్ప॥)
మచ్చికకు వెల లేదు మాటలకుఁ దుద లేదు
గచ్చులేల సేసేవే కాంతునితోను
ఇచ్చకమాడినదాన వెగసక్కే లాడనేల
పచ్చివెచ్చిఁ జేయకువే పాయని నీ వలపు

(॥ఎప్పు॥)
చేపులకు వంత లేదు సొంపులకు వేళలేదు
పైపై నలుగుదురా పతితోను
చేపట్టినదానవు సిగ్గులువదుదురా
ఆపసోపాలఁ బెట్టకు అందపునీవలపు

(॥ఎప్ప॥)
కూటమికి గురిలేదు కోరకకు కొద్ది లేదు
గాటారింపులేలే శ్రీవేంకటేశుతోను
చాటి కూడినదానవు జడియఁగనేమిటికి
తూఁటతాఁటల దాఁచకు తోరపునీవలపు

(||pallavi||)
ĕppaḍivalĕ nuṁḍare yĕravulu mīgela
kuppalum̐dĕppalunāya gurudaina valabu

(||ĕppa||)
machchigagu vĕla ledu māḍalagum̐ duda ledu
gachchulela seseve kāṁtunidonu
ichchagamāḍinadāna vĕgasakke lāḍanela
pachchivĕchchim̐ jeyaguve pāyani nī valabu

(||ĕppu||)
sebulagu vaṁta ledu sŏṁpulagu veḽaledu
paibai nalugudurā padidonu
sebaṭṭinadānavu sigguluvadudurā
ābasobālam̐ bĕṭṭagu aṁdabunīvalabu

(||ĕppa||)
kūḍamigi guriledu koragagu kŏddi ledu
gāḍāriṁpulele śhrīveṁkaḍeśhudonu
sāḍi kūḍinadānavu jaḍiyam̐ganemiḍigi
tūm̐ṭadām̐ṭala dām̐sagu torabunīvalabu