ఎప్పటివాఁడవేయంటా యెనసి మాటాడితిని
(॥పల్లవి॥)
ఎప్పటివాఁడవేయంటా యెనసి మాటాడితిని
తప్పు నే నెఱఁగనైతి తలఁపులో నుందును
(॥ఎప్ప॥)
సెలవి నే నవ్వితేనే సిగ్గువడే వింతలోనే
కలిగెనో నీవొళ్ళఁ గల్లయేమైనా
తొలఁగక యీసుద్ది తొలుతనే చెప్పవద్దా
కొలఁదితో నీగుణాలు గుట్టుసేతు నపుడే
(॥ఎప్ప॥)
తప్పక నే జూచితేను తలవంచే వింతలోనే
చెప్పరాక సేసితివో చేఁత లేమైనా
అప్పుడే నే నెఱిఁగితే నంత నిన్నుఁ బచ్చి సేయ
తొప్పఁదోఁచి యిందరిలో దొరఁ జేతు నిన్నును
(॥ఎప్ప॥)
గక్కున నేఁ గూడితేను కన్నులు దేలవేసేవు
మొక్కల మేమైనా నీపై మోచెనో మాట
చక్కని శ్రీవేంకటేశ సంతమయితి వప్పుడే
వెక్కసాలు మానితేను వెంగెమాడ నిన్నును
(||pallavi||)
ĕppaḍivām̐ḍaveyaṁṭā yĕnasi māḍāḍidini
tappu ne nĕṟam̐ganaidi talam̐pulo nuṁdunu
(||ĕppa||)
sĕlavi ne navvidene sigguvaḍe viṁtalone
kaligĕno nīvŏḽḽam̐ gallayemainā
tŏlam̐gaga yīsuddi tŏludane sĕppavaddā
kŏlam̐dido nīguṇālu guṭṭusedu nabuḍe
(||ĕppa||)
tappaga ne jūsidenu talavaṁche viṁtalone
sĕpparāga sesidivo sem̐ta lemainā
appuḍe ne nĕṟim̐gide naṁta ninnum̐ bachchi seya
tŏppam̐dom̐si yiṁdarilo dŏram̐ jedu ninnunu
(||ĕppa||)
gakkuna nem̐ gūḍidenu kannulu delavesevu
mŏkkala memainā nībai mosĕno māḍa
sakkani śhrīveṁkaḍeśha saṁtamayidi vappuḍe
vĕkkasālu mānidenu vĕṁgĕmāḍa ninnunu