Eppadivaamdave kaavaa yerumgudumu

ఎప్పటివాఁడవె కావా యెరుఁగుదుము
Language

(॥పల్లవి॥)
ఎప్పటివాఁడవె కావా యెరుఁగుదుము
తప్పులు పట్టఁగ నిన్నుఁ దగదయ్య మాకును

(॥ఎప్పటి॥)
చనవు సేసుక నే నీసరి నిలుచుందుఁ గాక
మన సిచ్చి నీవు నాతో మాట లాడేవా
వనిత లి దెరఁగరు వడి నేఁ గైకో నందురు
అనుమాన మెల్లఁ బాసె నంపవయ్య మమ్మును

(॥ఎప్పటి॥)
వూర కైనా నేనే వట్టి వూడిగాలు సేతుఁ గాక
మేరతో నీవు గొంతైన మెచ్చఁ బొయ్యేవా
నేర మెల్లఁ దీర నేఁడు నిన్ను ముదులకించితి
పోర నోప నీతోను పోవయ్య్ చాలును

(॥ఎప్పటి॥)
నంటున నీతో నేనే నవ్వులు నవ్వుదుఁ గాక
జంట యై నీ వట్టె సరసము లాడేవా
అంటిని శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
యింటికి వచ్చి కూడితి వేల వయ్య నన్నునూ

(||pallavi||)
ĕppaḍivām̐ḍavĕ kāvā yĕrum̐gudumu
tappulu paṭṭam̐ga ninnum̐ dagadayya māgunu

(||ĕppaḍi||)
sanavu sesuga ne nīsari nilusuṁdum̐ gāga
mana sichchi nīvu nādo māḍa lāḍevā
vanida li dĕram̐garu vaḍi nem̐ gaigo naṁduru
anumāna mĕllam̐ bāsĕ naṁpavayya mammunu

(||ĕppaḍi||)
vūra kainā nene vaṭṭi vūḍigālu sedum̐ gāga
merado nīvu gŏṁtaina mĕchcham̐ bŏyyevā
nera mĕllam̐ dīra nem̐ḍu ninnu mudulagiṁchidi
pora noba nīdonu povayy sālunu

(||ĕppaḍi||)
naṁṭuna nīdo nene navvulu navvudum̐ gāga
jaṁṭa yai nī vaṭṭĕ sarasamu lāḍevā
aṁṭini śhrīvĕṁkaḍeśha alamelumaṁga nenu
yiṁṭigi vachchi kūḍidi vela vayya nannunū