Eppadigi vinnabamu idiye summee

ఎప్పటికి విన్నపము ఇదియే సుమ్మీ
Language

(॥పల్లవి॥)
ఎప్పటికి విన్నపము ఇదియే సుమ్మీ
తప్పక నీవొడఁబాటు తరుణికి నీవు

(॥ఎప్ప॥)
వలపుచవులు చూపి జేకొంటి వింక
తలఁపున వేరొండుఁ దలఁచుకుమీ
కలసి వుందువుగాని కడదఁకా నిట్లానే
చెలఁగి తియ్యనినోరఁ జేదు చవిగాదు

(॥ఎప్ప॥)
యిందరు నెఱఁగఁ జెలి నింతగా మన్నంచితివి
కందులేనిచనవిచ్చి కరుణించుమీ
చందమున నాకెమాఁట జవదాటకుండవయ్య
విందువెట్టీఁ బగ వద్దు వేడుకయ్యా నిఁకను

(॥ఎప్పు॥)
వూరకుండినరమణి నొక్క టొక్కటె చేసి
చేరి కూడితివి రతిఁ జెలగించుమీ
యీరీతి శ్రీవేంకటేశ యీబంగారుకొండ
గారబానఁ జేపట్టి కడమేల నీకు

(||pallavi||)
ĕppaḍigi vinnabamu idiye summī
tappaga nīvŏḍam̐bāḍu taruṇigi nīvu

(||ĕppa||)
valabusavulu sūbi jegŏṁṭi viṁka
talam̐puna verŏṁḍum̐ dalam̐sugumī
kalasi vuṁduvugāni kaḍadam̐kā niṭlāne
sĕlam̐gi tiyyaninoram̐ jedu savigādu

(||ĕppa||)
yiṁdaru nĕṟam̐gam̐ jĕli niṁtagā mannaṁchidivi
kaṁdulenisanavichchi karuṇiṁchumī
saṁdamuna nāgĕmām̐ṭa javadāḍaguṁḍavayya
viṁduvĕṭṭīm̐ baga vaddu veḍugayyā nim̐kanu

(||ĕppu||)
vūraguṁḍinaramaṇi nŏkka ṭŏkkaḍĕ sesi
seri kūḍidivi radim̐ jĕlagiṁchumī
yīrīdi śhrīveṁkaḍeśha yībaṁgārugŏṁḍa
gārabānam̐ jebaṭṭi kaḍamela nīgu