Eppadigeppadi vaadu lemdaamkaane

ఎప్పటికెప్పటి వాదు లెందాఁకానే
Language

(॥పల్లవి॥)
ఎప్పటికెప్పటి వాదు లెందాఁకానే
కొప్పులు వీడినమీఁద కూడుకొనవలదా

(॥ఎప్ప॥)
సొగిసి మొగామొగాలు చూచుకొంటె జాలుఁగాక
తగవు లేమున్నవే తనకు నాకు
నగవులు సెలవులు నారుకొంటేఁ జాలుఁగాక
ఎగసక్కేలు మరెవ్వరు నేమాడేరే

(॥ఎప్ప॥)
ఆరీతినే మాటకు మాటాడుకొంటేఁ జాలుఁగాక
తారుకాణ లేమున్నవే తనకు నాకు
తారసించి మేనుమేనుఁ దగులైతేఁ జాలుఁగాక
నేరములు మరెవ్వరు నేఁడేమి వట్టిరే

(॥ఎప్ప॥)
ఇతవుతో నిట్లానే యెనసితేఁ జాలుఁగాక
తతి యెంచ నేమున్నదే తనకు నాకు
రతిని శ్రీవేంకటాద్రిరమణుఁడు నన్నే నేలె
మతకా లెవ్వరు నింక మరేమి వన్నేరె

(||pallavi||)
ĕppaḍigĕppaḍi vādu lĕṁdām̐kāne
kŏppulu vīḍinamīm̐da kūḍugŏnavaladā

(||ĕppa||)
sŏgisi mŏgāmŏgālu sūsugŏṁṭĕ jālum̐gāga
tagavu lemunnave tanagu nāgu
nagavulu sĕlavulu nārugŏṁṭem̐ jālum̐gāga
ĕgasakkelu marĕvvaru nemāḍere

(||ĕppa||)
ārīdine māḍagu māḍāḍugŏṁṭem̐ jālum̐gāga
tārugāṇa lemunnave tanagu nāgu
tārasiṁchi menumenum̐ dagulaidem̐ jālum̐gāga
neramulu marĕvvaru nem̐ḍemi vaṭṭire

(||ĕppa||)
idavudo niṭlāne yĕnasidem̐ jālum̐gāga
tadi yĕṁcha nemunnade tanagu nāgu
radini śhrīveṁkaḍādriramaṇum̐ḍu nanne nelĕ
madagā lĕvvaru niṁka maremi vannerĕ