Eppadi keppadi vaadu limka nemtigi

ఎప్పటి కెప్పటి వాదు లిఁక నేఁటికి
Language

(॥పల్లవి॥)
ఎప్పటి కెప్పటి వాదు లిఁక నేఁటికి
కుప్పలుగాఁ బంత మిచ్చేఁ గూచుండఁ గదరా

(॥ఎప్పటి॥)
ఊరకున్నవారి మమ్ము నుడికించి నవ్వ నేల
ఆరయ నా మాఁటఁ బడి యలుగ నేల
కూరిమి గలుగువారు కొసరితే నే మాయ
మేరతోనె వేఁడుకొంటి మెచ్చి నన్నుఁ జూడరా

(॥ఎప్పటి॥)
చింతతో నుండిన నాపైఁ జేయి చాఁచ రా నేల
యింతలో విదిలించి వేయించుకో నేల
యింతు లైనవా రేమన్నా నే మాయఁ బురుషులకు
రంతు లేల నీకు మెక్కే రారా మా యింటికి

(॥ఎప్పటి॥)
పాయపువారిఁ గూడి పాసి కొంత వేఁచ నేల
సేయరానిచేఁతఁ బడి సిగ్గు లిం తేల
యీయెడ శ్రీవెంకటేశ యిట్టె నే నిన్నుఁ గూడితి
కాయము గాయముఁ గూడె కడమ మా టాడరా

(||pallavi||)
ĕppaḍi kĕppaḍi vādu lim̐ka nem̐ṭigi
kuppalugām̐ baṁta michchem̐ gūsuṁḍam̐ gadarā

(||ĕppaḍi||)
ūragunnavāri mammu nuḍigiṁchi navva nela
āraya nā mām̐ṭam̐ baḍi yaluga nela
kūrimi galuguvāru kŏsaride ne māya
meradonĕ vem̐ḍugŏṁṭi mĕchchi nannum̐ jūḍarā

(||ĕppaḍi||)
siṁtado nuṁḍina nābaim̐ jeyi sām̐sa rā nela
yiṁtalo vidiliṁchi veyiṁchugo nela
yiṁtu lainavā remannā ne māyam̐ buruṣhulagu
raṁtu lela nīgu mĕkke rārā mā yiṁṭigi

(||ĕppaḍi||)
pāyabuvārim̐ gūḍi pāsi kŏṁta vem̐sa nela
seyarānisem̐tam̐ baḍi siggu liṁ tela
yīyĕḍa śhrīvĕṁkaḍeśha yiṭṭĕ ne ninnum̐ gūḍidi
kāyamu gāyamum̐ gūḍĕ kaḍama mā ṭāḍarā