Eppadi kappude kaaga yimta galadaa

ఎప్పటి కప్పుడె కాక యింత గలదా
Language

(॥పల్లవి॥)
ఎప్పటి కప్పుడె కాక యింత గలదా
వుప్పొలికి యినుమడౌ నొక్కరీతి వచ్చునా

(॥ఎప్పటి॥)
అద్దో రమ్మనుచు నీవానలు వెట్టకువే
చద్దివల పేడ నైన సంగర మౌనో
తిద్దుబడి నీ కిచ్చినదె మాఁటపట్టు దొల్లి
వుద్డండాన తప్పుఁదారు వూహించిన ట్టుండునా

(॥ఎప్పటి॥)
అండ నుండు మని నన్ను నంత వాలాయించకువే
అండుకొని మరుఁ డేడ నాయ మేసునో
మెండుగా నీకు నిట్టె మీఁ దెత్తినవయసు
బండు సేసి యెవ్వతింటి పంచపాలు సేసునో

(॥ఎప్పటి॥)
కూచుండు మనుచు నన్నుఁ గొంగు వట్టి తియ్యకువే
చూచి చూచి యెవ్వ తైన సూడు వట్టునో
యేచి శ్రీవెంకటేశుఁడ యిట్టె నిన్ను నేఁ గూడితి
యిచాయతమకయిన యిఁక నెంత సేసునో

(||pallavi||)
ĕppaḍi kappuḍĕ kāga yiṁta galadā
vuppŏligi yinumaḍau nŏkkarīdi vachchunā

(||ĕppaḍi||)
addo rammanusu nīvānalu vĕṭṭaguve
saddivala peḍa naina saṁgara mauno
tiddubaḍi nī kichchinadĕ mām̐ṭabaṭṭu dŏlli
vudḍaṁḍāna tappum̐dāru vūhiṁchina ṭṭuṁḍunā

(||ĕppaḍi||)
aṁḍa nuṁḍu mani nannu naṁta vālāyiṁchaguve
aṁḍugŏni marum̐ ḍeḍa nāya mesuno
mĕṁḍugā nīgu niṭṭĕ mīm̐ dĕttinavayasu
baṁḍu sesi yĕvvadiṁṭi paṁchabālu sesuno

(||ĕppaḍi||)
kūsuṁḍu manusu nannum̐ gŏṁgu vaṭṭi tiyyaguve
sūsi sūsi yĕvva taina sūḍu vaṭṭuno
yesi śhrīvĕṁkaḍeśhum̐ḍa yiṭṭĕ ninnu nem̐ gūḍidi
yisāyadamagayina yim̐ka nĕṁta sesuno