Eppadi kappude kaaga imkanemtige

ఎప్పటి కప్పుడే కాక ఇఁకనేఁటికే
Language

(॥పల్లవి॥)
ఎప్పటి కప్పుడే కాక ఇఁకనేఁటికే
చొప్పులెత్తి చూచేమంటే సుద్దులెన్ని లేవే

(॥॥)
చన్నుల నొత్తఁగరాదా సారెకు నవ్వఁగరాదా
చిన్నఁ బోయి వుండనేలే చెలియ నీకు
సన్నలు సేసి యతఁడు సరసము లాడీని
నిన్న నెల్లా రాకుండినా నేఁడు వచ్చెఁగదవే

(॥॥)
కలకలనవ్వరాదా కాఁగిలించుకొనరాదా
తలవంచుకొననేలే తరుణి నీకు
బలిమి నేసి యతఁడు పంతమిచ్చి బుజ్జగించీ
పలుకకుండినవాడు బత్తి సేసెఁగదవే

(॥॥)
పువ్వులు ముడువరాదా పొందులుచూపఁగరాదా
నివ్వెరగందఁగనేలే నెలఁత నీకు
ఇవ్వల శ్రీ వేంకటేశుఁ డిప్పు డిట్టె నిన్నుఁ గూడె
యెవ్వరిఁ బెండ్లాడినా నీ కిరవాయఁ గదవే

(||pallavi||)
ĕppaḍi kappuḍe kāga im̐kanem̐ṭige
sŏppulĕtti sūsemaṁṭe suddulĕnni leve

(||||)
sannula nŏttam̐garādā sārĕgu navvam̐garādā
sinnam̐ boyi vuṁḍanele sĕliya nīgu
sannalu sesi yadam̐ḍu sarasamu lāḍīni
ninna nĕllā rāguṁḍinā nem̐ḍu vachchĕm̐gadave

(||||)
kalagalanavvarādā kām̐giliṁchugŏnarādā
talavaṁchugŏnanele taruṇi nīgu
balimi nesi yadam̐ḍu paṁtamichchi bujjagiṁchī
palugaguṁḍinavāḍu batti sesĕm̐gadave

(||||)
puvvulu muḍuvarādā pŏṁdulusūbam̐garādā
nivvĕragaṁdam̐ganele nĕlam̐ta nīgu
ivvala śhrī veṁkaḍeśhum̐ ḍippu ḍiṭṭĕ ninnum̐ gūḍĕ
yĕvvarim̐ bĕṁḍlāḍinā nī kiravāyam̐ gadave