Enugaladoda nela yelaadaalu

ఏనుగలతోడ నేల యేలాటాలు
Language

(॥పల్లవి॥)
ఏనుగలతోడ నేల యేలాటాలు
కానుక లిచ్చె గుట్టు గనుకొనేను

(॥ఏనుగల॥)
రమ్మన నేఁటికి నిన్ను రాకు మన నేఁటికి
వుమ్మడి నుండె నీ వోజ చూచేను
సమ్మతించఁగా నెట్టొ జగడించఁగా నెట్టొ
నిమ్మపంటిచేతితోడ నివ్వెర గందేనూ

(॥ఏనుగుల॥)
నవ్వు నవ్వ నేఁటికి నాలితన మేఁటికి
దవ్వులనుండె నీ తమి చూచేను
పువ్వు లనఁగా నెట్టొ పూఁప లనఁగా నెట్టొ
మువ్వంక సాసముత్యాల ముగ్గులు వెట్టేను

(॥ఏనుగుల॥)
వొడఁబరచ నేఁటికి వోప నన నేఁటికి
కడలేని మోహముతోఁ గాఁగిలించేను
నడుమనె కూడితిని నమ్మించి శ్రీవెంకటేశ
చిడుముడి నుంగరాలచేతఁ జెక్కు నొక్కేను

(||pallavi||)
enugaladoḍa nela yelāḍālu
kānuga lichchĕ guṭṭu ganugŏnenu

(||enugala||)
rammana nem̐ṭigi ninnu rāgu mana nem̐ṭigi
vummaḍi nuṁḍĕ nī voja sūsenu
sammadiṁcham̐gā nĕṭṭŏ jagaḍiṁcham̐gā nĕṭṭŏ
nimmabaṁṭisedidoḍa nivvĕra gaṁdenū

(||enugula||)
navvu navva nem̐ṭigi nālidana mem̐ṭigi
davvulanuṁḍĕ nī tami sūsenu
puvvu lanam̐gā nĕṭṭŏ pūm̐pa lanam̐gā nĕṭṭŏ
muvvaṁka sāsamutyāla muggulu vĕṭṭenu

(||enugula||)
vŏḍam̐barasa nem̐ṭigi voba nana nem̐ṭigi
kaḍaleni mohamudom̐ gām̐giliṁchenu
naḍumanĕ kūḍidini nammiṁchi śhrīvĕṁkaḍeśha
siḍumuḍi nuṁgarālasedam̐ jĕkku nŏkkenu