Enniroobulainaam jooba nidamde nersu

ఎన్నిరూపులైనాఁ జూప నితఁడే నేర్చు
Language

(॥పల్లవి॥)
ఎన్నిరూపులైనాఁ జూప నితఁడే నేర్చు

మున్నే యనంతావతారములవాఁడు గనక

(॥ఎన్ని॥)
పన్నీటిమజ్జనవేళ భావించి చూచితేను

మిన్నక నాభికిఁ గిందు మీనుసోగయై

మిన్నేరుపైఁ దొరుగఁగా మించి యెదురెక్కి నిలు

చున్నమచ్చావతారమై వున్నాఁడు దేవుఁడు

(॥ఎన్ని॥)
మిక్కిలి కప్రకా పామీఁద నిండాఁ జాఁతఁగాను

చక్క నాల్గు చేతులతో సర్వేశ్వరుఁడు

తక్కక శుక్లాంబరధరుఁడైన విష్ణుఁడే

పక్కనఁ దా నని చెప్పి ప్రత్యక్షమై వుండెను

(॥ఎన్ని॥)
సాసగఁగఁ బుళుకాపున నల్లనగుమేన

పసిఁడి యలమేల్మంగపైఁ గటుక

అసమున రుక్కిణిఁ బెండ్లాడే గోవిందునివలె

వెస శ్రీవేంకటేశుఁడు వెలయించె నిపుడు

(||pallavi||)
ĕnnirūbulainām̐ jūba nidam̐ḍe nersu

munne yanaṁtāvadāramulavām̐ḍu ganaga

(||ĕnni||)
pannīḍimajjanaveḽa bhāviṁchi sūsidenu

minnaga nābhigim̐ giṁdu mīnusogayai

minnerubaim̐ dŏrugam̐gā miṁchi yĕdurĕkki nilu

sunnamachchāvadāramai vunnām̐ḍu devum̐ḍu

(||ĕnni||)
mikkili kapragā pāmīm̐da niṁḍām̐ jām̐tam̐gānu

sakka nālgu sedulado sarveśhvarum̐ḍu

takkaga śhuklāṁbaradharum̐ḍaina viṣhṇum̐ḍe

pakkanam̐ dā nani sĕppi pratyakṣhamai vuṁḍĕnu

(||ĕnni||)
sāsagam̐gam̐ buḽugābuna nallanagumena

pasim̐ḍi yalamelmaṁgabaim̐ gaḍuga

asamuna rukkiṇim̐ bĕṁḍlāḍe goviṁdunivalĕ

vĕsa śhrīveṁkaḍeśhum̐ḍu vĕlayiṁchĕ nibuḍu