Ennimaayalu sesevu yemtivesaalu boyyevu

ఎన్నిమాయలు సేసేవు యేఁటివేసాలు బొయ్యేవు
Language

(॥పల్లవి॥)
ఎన్నిమాయలు సేసేవు యేఁటివేసాలు బొయ్యేవు
నిన్ను నన్ను నెంచుకొంటే నీవే కావా

(॥ఎన్ని॥)
మిన్నక నీవలపులే మెరమీ నింతేకాక
కన్నులనాచూపు నీపైఁ గాఁడిపారీనా
తిన్ననై నీకాఁక తరితీపులు సేసీఁగాక
వున్నతి నామోవి నోరూరించీనా

(॥ఎన్ని॥)
పట్టరానినీవయసు భ్రమయించీ నింతేకాక
గట్టినాచన్నులు నీకళ దాఁకీనా
నెట్టన నీతమకమే నిన్నుఁ గరఁగించీఁగాక
తొట్టి నాచక్కఁదనము దొమ్మిసేసీనా

(॥ఎన్ని॥)
కలనీ నీకాఁగిలే గక్కనఁ జొక్కించెఁగాక
మలసి నామేలు నిన్ను మఱపించెనా
తెలిపి శ్రీవేంకటేశ దిక్కయి నన్నేలితివి
చలపట్టి నాగుణము సాదించెనా

(||pallavi||)
ĕnnimāyalu sesevu yem̐ṭivesālu bŏyyevu
ninnu nannu nĕṁchugŏṁṭe nīve kāvā

(||ĕnni||)
minnaga nīvalabule mĕramī niṁtegāga
kannulanāsūbu nībaim̐ gām̐ḍibārīnā
tinnanai nīgām̐ka taridībulu sesīm̐gāga
vunnadi nāmovi norūriṁchīnā

(||ĕnni||)
paṭṭarāninīvayasu bhramayiṁchī niṁtegāga
gaṭṭināsannulu nīgaḽa dām̐kīnā
nĕṭṭana nīdamagame ninnum̐ garam̐giṁchīm̐gāga
tŏṭṭi nāsakkam̐danamu dŏmmisesīnā

(||ĕnni||)
kalanī nīgām̐gile gakkanam̐ jŏkkiṁchĕm̐gāga
malasi nāmelu ninnu maṟabiṁchĕnā
tĕlibi śhrīveṁkaḍeśha dikkayi nannelidivi
salabaṭṭi nāguṇamu sādiṁchĕnā