Ennilevu suddulu yemtigi visaaraalu

ఎన్నిలేవు సుద్దులు యేఁటికి విచారాలు
Language

(॥పల్లవి॥)
ఎన్నిలేవు సుద్దులు యేఁటికి విచారాలు
మన్నించి ఆ చింతలెల్లా మానుము నీ విఁకను

(॥ఎన్ని॥)
మనసెఱిఁగినచోట మాటలు సోదించనేల
తనువుకుఁ దనువే తారుకాణ
పనిమాలినపనికి బాసలేల సేసేవు
చెనకితి లోనికి విచ్చేయవయ్యా యిఁకను

(॥ఎని॥)
కూడివుండినట్టిచోట గుఱుతు వెతకనేల
వేడుకలు వేడుకలే వీడుజోళ్లు
జాడలతో వారి వీరి సాకిరేల తెలిపేవు
వీడెమిచ్చే నామాఁట వినవయ్య ఇఁకను

(॥ఎన్ని॥)
రతి గలిగినచోట రవ్వసేయఁగనేల
యితవుకు నితవులే యియ్యకోళ్లు
సతమై శ్రీవేంకటేశ సరిగాఁ గూడితి నన్ను
అతిముదములు మనకబ్బెనయ్యా ఇఁకను

(||pallavi||)
ĕnnilevu suddulu yem̐ṭigi visārālu
manniṁchi ā siṁtalĕllā mānumu nī vim̐kanu

(||ĕnni||)
manasĕṟim̐ginasoḍa māḍalu sodiṁchanela
tanuvugum̐ danuve tārugāṇa
panimālinabanigi bāsalela sesevu
sĕnagidi lonigi vichcheyavayyā yim̐kanu

(||ĕni||)
kūḍivuṁḍinaṭṭisoḍa guṟudu vĕdaganela
veḍugalu veḍugale vīḍujoḽlu
jāḍalado vāri vīri sāgirela tĕlibevu
vīḍĕmichche nāmām̐ṭa vinavayya im̐kanu

(||ĕnni||)
radi galiginasoḍa ravvaseyam̐ganela
yidavugu nidavule yiyyagoḽlu
sadamai śhrīveṁkaḍeśha sarigām̐ gūḍidi nannu
adimudamulu managabbĕnayyā im̐kanu