Ennilevu neesuddulu yerimginavela kannu

ఎన్నిలేవు నీసుద్దులు యెరిఁగినవేళ కన్ను
Language

(॥పల్లవి॥)
ఎన్నిలేవు నీసుద్దులు యెరిఁగినవేళ కన్ను-
సన్నలు సేసేవు కడుసాదువలెనె

(॥ఎన్ని॥)
కాతరాన నాపె నీపై కప్పురము చల్లెనంటా
యేతులకు నందరితో నేమి చెప్పేవు
చూతముగా నీవాకెతో చుట్టరికము మానేవా
నీతితోడ మాటాడేవు నిజమరివలెనే

(॥ఎన్ని॥)
వాకుచ్చి యప్పటి నాపె వరుసతోఁ దిట్టెనంటా
సాకిరేల పెట్టేవు సతులనెల్లా
యీకడనే పచ్చిదేరీ నిదివో నీయాచారాలు
పైకొని సాదించేవు పంతగానివలెనే

(॥ఎన్ని॥)
రవ్వలుగా నేఁ డాపె రచ్చలోఁ జెనకెనంటా
నవ్వులు నవ్వేవు నీవు నాతులెదుట
చివ్వన నన్నేలితివి శ్రీవేంకటేశ్వర
తవ్వేవు వలపులెల్లా తగవరివలెనే

(||pallavi||)
ĕnnilevu nīsuddulu yĕrim̐ginaveḽa kannu-
sannalu sesevu kaḍusāduvalĕnĕ

(||ĕnni||)
kādarāna nābĕ nībai kappuramu sallĕnaṁṭā
yedulagu naṁdarido nemi sĕppevu
sūdamugā nīvāgĕdo suṭṭarigamu mānevā
nīdidoḍa māḍāḍevu nijamarivalĕne

(||ĕnni||)
vāguchchi yappaḍi nābĕ varusadom̐ diṭṭĕnaṁṭā
sāgirela pĕṭṭevu sadulanĕllā
yīgaḍane pachchiderī nidivo nīyāsārālu
paigŏni sādiṁchevu paṁtagānivalĕne

(||ĕnni||)
ravvalugā nem̐ ḍābĕ rachchalom̐ jĕnagĕnaṁṭā
navvulu navvevu nīvu nādulĕduḍa
sivvana nannelidivi śhrīveṁkaḍeśhvara
tavvevu valabulĕllā tagavarivalĕne