Ennilevu nee vidya lemi sesedi

ఎన్నిలేవు నీ విద్య లేమి సేసేది
Language

(॥పల్లవి॥)
ఎన్నిలేవు నీ విద్య లేమి సేసేది
ఇన్నిటా నీ మోహము నా యెడనే పూసేవు

(॥ఎన్ని॥)
సందడించే పూడిగపు సతులెల్లా నుండఁగాను
గొందినుండి నన్ను నేల కొంగునట్టేవు
నిందలకు వెఱచేవా నేమము నీకున్నదా
ఇందులో నీ పెద్దరిక మిప్పుడే చూపేవు

(॥ఎన్ని॥)
కప్పములు దెచ్చుకొన్న కాంతలెల్లా నుండఁగాను
చిప్పిల నామీఁదనేల చేయి చాఁచేవు
తప్పుఁగులము లెంచేవా తగురూపాలు చూచేవా
ముప్పిరి నీ దొరతనములు పచారించేవు

(॥ఎన్ని॥)
కోరి కొలువులుసేసే కొమ్మలెల్లా నుండఁగాను
పేరుకొని వచ్చి నన్నే పెండ్లాడేవు
యీరీతి శ్రీవేంకటేశ ఇంతేసి విచారించేవా
గారవించి నన్నుఁ గడు కాఁగిట నించేవు

(||pallavi||)
ĕnnilevu nī vidya lemi sesedi
inniḍā nī mohamu nā yĕḍane pūsevu

(||ĕnni||)
saṁdaḍiṁche pūḍigabu sadulĕllā nuṁḍam̐gānu
gŏṁdinuṁḍi nannu nela kŏṁgunaṭṭevu
niṁdalagu vĕṟasevā nemamu nīgunnadā
iṁdulo nī pĕddariga mippuḍe sūbevu

(||ĕnni||)
kappamulu dĕchchugŏnna kāṁtalĕllā nuṁḍam̐gānu
sippila nāmīm̐danela seyi sām̐sevu
tappum̐gulamu lĕṁchevā tagurūbālu sūsevā
muppiri nī dŏradanamulu pasāriṁchevu

(||ĕnni||)
kori kŏluvulusese kŏmmalĕllā nuṁḍam̐gānu
perugŏni vachchi nanne pĕṁḍlāḍevu
yīrīdi śhrīveṁkaḍeśha iṁtesi visāriṁchevā
gāraviṁchi nannum̐ gaḍu kām̐giḍa niṁchevu