Ennigaaya logamuna kivigo mee sobagulu

ఎన్నికాయ లోకమున కివిగో మీ సొబగులు
Language

(॥పల్లవి॥)
ఎన్నికాయ లోకమున కివిగో మీ సొబగులు
అన్నిచందముల మీరు అమరివున్నారు

(॥ఎన్ని॥)
కొమ్మకును నీకును గూడినవేళ లెట్టివో
పమ్ముకొన్న మీనోముఫల మెట్టిదో
కమ్మర మీపొందులు కంతుఁడెట్టు గూరిచెనో
ఇమ్ముల బాలును నీరు నెనసినట్టున్నారు

(॥ఎన్ని॥)
యిద్దరికిఁ బొంతనాలు యెటువలెఁ గూడెనో
అద్దుకొన్నమాటపట్టు లవి యెట్టివో
బుద్దులు వెన్నతోఁ బెట్టి బోదించినవా రెవ్వరో
వొద్దిక మోరుపుమేఘ మొనరినట్టున్నారు

(॥ఎన్ని॥)
వువ్విళ్ళూర మీమనసు లొక్కజాడ లెట్టాయనో
జవ్వనము లెటువలె సమమాయనో
యివ్వల శ్రీవేంకటేశ యాకె యలమేలుమంగ
పువ్వుఁబరిమళమునై పొసఁగి యున్నారు

(||pallavi||)
ĕnnigāya logamuna kivigo mī sŏbagulu
annisaṁdamula mīru amarivunnāru

(||ĕnni||)
kŏmmagunu nīgunu gūḍinaveḽa lĕṭṭivo
pammugŏnna mīnomuphala mĕṭṭido
kammara mībŏṁdulu kaṁtum̐ḍĕṭṭu gūrisĕno
immula bālunu nīru nĕnasinaṭṭunnāru

(||ĕnni||)
yiddarigim̐ bŏṁtanālu yĕḍuvalĕm̐ gūḍĕno
addugŏnnamāḍabaṭṭu lavi yĕṭṭivo
buddulu vĕnnadom̐ bĕṭṭi bodiṁchinavā rĕvvaro
vŏddiga morubumegha mŏnarinaṭṭunnāru

(||ĕnni||)
vuvviḽḽūra mīmanasu lŏkkajāḍa lĕṭṭāyano
javvanamu lĕḍuvalĕ samamāyano
yivvala śhrīveṁkaḍeśha yāgĕ yalamelumaṁga
puvvum̐barimaḽamunai pŏsam̐gi yunnāru