ఎన్నిటికైనా వచ్చు నిచ్చకపు నీ చేఁతలు
(॥పల్లవి॥)
ఎన్నిటికైనా వచ్చు నిచ్చకపు నీ చేఁతలు
మన్నన నాకిచ్చితివో మహిమ చూపేవో
(॥ఎన్ని॥)
మనసు చూడవలసి మచ్చిక నాకుఁజేసేవో
యెనయ నిజాలకును యింపు గలదో
పని గలిగి నాతోను పలుమారు బలికేవో
అనిశము నూరకే ఆసలు చూపేవో
(॥ఎన్ని॥)
ప్రియము గలిగి నాతోఁ బెనఁగాడ వచ్చేవో
బయకారములు నాతోఁ బచారించేవో
నయాన బత్తి గలిగి నవ్వులు నవ్వేవో
క్రియ దెలిసినదాఁకా గేలిసేసేవో
(॥ఎన్ని॥)
కరుణ గలిగి ననుఁ గాఁగిలించి కూడితివో
తరుణుల కిది చూపి తమి రేఁచేవో
నిరతి శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
యిరవై నన్నేలితివో యిది నీ వినోదమో
(||pallavi||)
ĕnniḍigainā vachchu nichchagabu nī sem̐talu
mannana nāgichchidivo mahima sūbevo
(||ĕnni||)
manasu sūḍavalasi machchiga nāgum̐jesevo
yĕnaya nijālagunu yiṁpu galado
pani galigi nādonu palumāru baligevo
aniśhamu nūrage āsalu sūbevo
(||ĕnni||)
priyamu galigi nādom̐ bĕnam̐gāḍa vachchevo
bayagāramulu nādom̐ basāriṁchevo
nayāna batti galigi navvulu navvevo
kriya dĕlisinadām̐kā gelisesevo
(||ĕnni||)
karuṇa galigi nanum̐ gām̐giliṁchi kūḍidivo
taruṇula kidi sūbi tami rem̐sevo
niradi śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
yiravai nannelidivo yidi nī vinodamo