Ennidi kimkam daa nedarayinaso

ఎన్నిటి కిఁకఁ దా నెడరయినచో
Language

(॥పల్లవి॥)
ఎన్నిటి కిఁకఁ దా నెడరయినచో
కన్నియ నింతటఁ గావఁగవలదా

(॥ఎన్ని॥)
కలువ వాఁడియట ఘనచందురుఁడట
యెలమిఁ జెలినిట్ల నేఁచేదా
బలుచుట్టముగలఫలము విరహదెస
కలసిమెలసి యిటు కావఁగవలదా

(॥ఎన్ని॥)
చందనగందెట చలువగాలియట
యిందునె చెలి నలయించేదా
అందపుచుట్టఁ బైనఫల మిపుడు
కందువ నిట్టె కాచుట యరుదా

(॥ఎన్ని॥)
అతిశయిలకుచయట శ్రీవేంకట -
పతియట కాఁగిట భ్రమసేదా
చతురత నిరువురసరసవువేళల
అతిశయసంఘము లలరుటగాక

(||pallavi||)
ĕnniḍi kim̐kam̐ dā nĕḍarayinaso
kanniya niṁtaḍam̐ gāvam̐gavaladā

(||ĕnni||)
kaluva vām̐ḍiyaḍa ghanasaṁdurum̐ḍaḍa
yĕlamim̐ jĕliniṭla nem̐sedā
balusuṭṭamugalaphalamu virahadĕsa
kalasimĕlasi yiḍu kāvam̐gavaladā

(||ĕnni||)
saṁdanagaṁdĕḍa saluvagāliyaḍa
yiṁdunĕ sĕli nalayiṁchedā
aṁdabusuṭṭam̐ bainaphala mibuḍu
kaṁduva niṭṭĕ kāsuḍa yarudā

(||ĕnni||)
adiśhayilagusayaḍa śhrīveṁkaḍa -
padiyaḍa kām̐giḍa bhramasedā
sadurada niruvurasarasavuveḽala
adiśhayasaṁghamu lalaruḍagāga