Ennibaatlam baddaanu yevvarigim jeppinaanu

ఎన్నిపాట్లఁ బడ్డాను యెవ్వరికిఁ జెప్పినాను
Language

(॥పల్లవి॥)
ఎన్నిపాట్లఁ బడ్డాను యెవ్వరికిఁ జెప్పినాను
పన్ని నీముద్రలఁ గాక పాపము వోయీనా

(॥ఎన్ని॥)
కందువ నీపాదాలపైఁ గట్టిపెట్టినఁ గాక
సందులుదూరే మనసు చక్కనుండీనా
నిందలేక యేపొద్దు నిన్నే కొలిచినఁ గాక
తుందుడుకు నీమాయ తొలఁగిపోయీనా

(॥ఎన్ని॥)
వుడివోని రుచులు నీకొప్పగించినఁ గాక
బడిఁ బంచేంద్రియములు పాయనిచ్చీనా
జడియక నే నీకు శరణుచొచ్చినఁ గాక
వొడలిలో కామక్రోధా లుడిగిపోయీనా

(॥ఎన్ని॥)
నిక్కపు నాకర్మములు నీకొరకునైనఁ గాక
యిక్కడ నేఁ జేసేటి హింస మానీనా
పక్కన నలమేల్మంగపతివి శ్రీవేంకటేశ
అక్కర నీకు మొక్కక అజ్ఞానము వోయీనా

(||pallavi||)
ĕnnibāṭlam̐ baḍḍānu yĕvvarigim̐ jĕppinānu
panni nīmudralam̐ gāga pābamu voyīnā

(||ĕnni||)
kaṁduva nībādālabaim̐ gaṭṭibĕṭṭinam̐ gāga
saṁduludūre manasu sakkanuṁḍīnā
niṁdalega yebŏddu ninne kŏlisinam̐ gāga
tuṁduḍugu nīmāya tŏlam̐giboyīnā

(||ĕnni||)
vuḍivoni rusulu nīgŏppagiṁchinam̐ gāga
baḍim̐ baṁcheṁdriyamulu pāyanichchīnā
jaḍiyaga ne nīgu śharaṇusŏchchinam̐ gāga
vŏḍalilo kāmakrodhā luḍigiboyīnā

(||ĕnni||)
nikkabu nāgarmamulu nīgŏragunainam̐ gāga
yikkaḍa nem̐ jeseḍi hiṁsa mānīnā
pakkana nalamelmaṁgabadivi śhrīveṁkaḍeśha
akkara nīgu mŏkkaga ajñānamu voyīnā