Enni vesaalu nerise nidivo yeege

ఎన్ని వేసాలు నేరిచె నిదివో యీకె
Language

(॥పల్లవి॥)
ఎన్ని వేసాలు నేరిచె నిదివో యీకె
నిన్నడిగేఁ జెప్పవయ్యా నేఁడు నాతో నన్నియు

(॥ఎన్ని॥)
చెలులచే నాపె నీకుఁ జెప్పిపంపినమాటలు
వెలలేని వేడుకతో వినుకొంటివా
కలికితనాల వారి కానుక నిమ్మనండ్లు
అలరుచుఁ జేతులారా నందుకొంటివా

(॥ఎన్ని॥)
పొందుగా నాపె నీకుఁ బుత్తెంచిన లేకలు
తుందుడుకులేక చదువుకొంటివా
చెంది తనరూపు వా(వ్రా?)సిన చిత్రపు పటము
కందువగా నీవు లెస్స కనుఁగొంటివా

(॥ఎన్ని॥)
యిక్కడికిఁ దానే వచ్చి యిచ్చిన యీపె వీడెము
పిక్కటిల్ల నీపుక్కిటఁ బెట్టుకొంటివా
యిక్కవగా శ్రీవేంకటేశ నన్ను నేలితివి
వుక్కుమీర నాపెచేత నూడిగాలు గొంటివా

(||pallavi||)
ĕnni vesālu nerisĕ nidivo yīgĕ
ninnaḍigem̐ jĕppavayyā nem̐ḍu nādo nanniyu

(||ĕnni||)
sĕlulase nābĕ nīgum̐ jĕppibaṁpinamāḍalu
vĕlaleni veḍugado vinugŏṁṭivā
kaligidanāla vāri kānuga nimmanaṁḍlu
alarusum̐ jedulārā naṁdugŏṁṭivā

(||ĕnni||)
pŏṁdugā nābĕ nīgum̐ buttĕṁchina legalu
tuṁduḍugulega saduvugŏṁṭivā
sĕṁdi tanarūbu vā(vrā?)sina sitrabu paḍamu
kaṁduvagā nīvu lĕssa kanum̐gŏṁṭivā

(||ĕnni||)
yikkaḍigim̐ dāne vachchi yichchina yībĕ vīḍĕmu
pikkaḍilla nībukkiḍam̐ bĕṭṭugŏṁṭivā
yikkavagā śhrīveṁkaḍeśha nannu nelidivi
vukkumīra nābĕseda nūḍigālu gŏṁṭivā