ఎన్ని వేదాలు చదివి యెంత సోమయాజివైన
(॥పల్లవి॥)
ఎన్ని వేదాలు చదివి యెంత సోమయాజివైన
కన్నెలు వద్దనుండగా కాంక్ష లేల తీరును
(॥ఎన్ని॥)
కోరకుండేవా నీవు గొల్లెతలఁగాను గనుగొంటే
పారదా మనసు వారిపాలిండ్ల పై
ఊరదానినోరుతేనె లొలికేమోవిపండ్లకు
పేరదా వలపు వారి బెల్లింపుమాటలను
(॥ఎన్ని॥)
చిక్కవా వారికి నీవు చేతులు పైఁ జాఁచితేను
చొక్కకుండేవా మేనులు సోఁకించితేను
చక్కనుండేవా వారు సరసము లాడితేను
పక్కన రేఁగదా తమి భావించి నవ్వితేను
(॥ఎన్ని॥)
పాయఁగలవా సతులు భ్రమయించి కూడితేను
ఆయనా తనివి నీకు సంతలోననే
యేయడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
మాయలకు లోను గాదా మంతనమాడితేను
(||pallavi||)
ĕnni vedālu sadivi yĕṁta somayājivaina
kannĕlu vaddanuṁḍagā kāṁkṣha lela tīrunu
(||ĕnni||)
koraguṁḍevā nīvu gŏllĕdalam̐gānu ganugŏṁṭe
pāradā manasu vāribāliṁḍla pai
ūradāninorudenĕ lŏligemovibaṁḍlagu
peradā valabu vāri bĕlliṁpumāḍalanu
(||ĕnni||)
sikkavā vārigi nīvu sedulu paim̐ jām̐sidenu
sŏkkaguṁḍevā menulu som̐kiṁchidenu
sakkanuṁḍevā vāru sarasamu lāḍidenu
pakkana rem̐gadā tami bhāviṁchi navvidenu
(||ĕnni||)
pāyam̐galavā sadulu bhramayiṁchi kūḍidenu
āyanā tanivi nīgu saṁtalonane
yeyaḍa śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
māyalagu lonu gādā maṁtanamāḍidenu