ఎన్ని సేఁతలు సేసేవే యిప్పుడే నీవు
(॥పల్లవి॥)
ఎన్ని సేఁతలు సేసేవే యిప్పుడే నీవు
కన్నెపడుచ వప్పుడే కప్పుర మిచ్చేవు
(॥ఎన్ని॥)
కొలువులో రమణుఁడు కోరి నీతో నవ్వెనంటా
చెలరేఁగి చెలరేఁగి చేయి చాఁచేవు
వెలయఁ జెవిలో వచ్చి విన్నపాలు చేసేవు
కలికితనాలు చూపి కానుక లిచ్చేవు
(॥ఎన్ని॥)
దండనుండి నిన్నాతఁడు తప్పక చూచెనంటా
బెండుపడఁ గాతరానఁ బెనఁగేవు
మెండుకొన వీడెమిచ్చి మేకులెల్లాఁ జేసేవు
కొండవంటిదొర నిట్టే కుచాల నొత్తేవు
(॥ఎన్ని॥)
పానుపుపై శ్రీవేంకటపతి నిన్నుఁ గూడెనంటా
నానఁబెట్టి యిటులానే నంటు సేసేవు
తానకమై యాతఁడిట్టే తగనన్ను నేలినాఁడు
మోనాన నితనిమెచ్చి మొక్కులు మొక్కేవు
(||pallavi||)
ĕnni sem̐talu seseve yippuḍe nīvu
kannĕbaḍusa vappuḍe kappura michchevu
(||ĕnni||)
kŏluvulo ramaṇum̐ḍu kori nīdo navvĕnaṁṭā
sĕlarem̐gi sĕlarem̐gi seyi sām̐sevu
vĕlayam̐ jĕvilo vachchi vinnabālu sesevu
kaligidanālu sūbi kānuga lichchevu
(||ĕnni||)
daṁḍanuṁḍi ninnādam̐ḍu tappaga sūsĕnaṁṭā
bĕṁḍubaḍam̐ gādarānam̐ bĕnam̐gevu
mĕṁḍugŏna vīḍĕmichchi megulĕllām̐ jesevu
kŏṁḍavaṁṭidŏra niṭṭe kusāla nŏttevu
(||ĕnni||)
pānububai śhrīveṁkaḍabadi ninnum̐ gūḍĕnaṁṭā
nānam̐bĕṭṭi yiḍulāne naṁṭu sesevu
tānagamai yādam̐ḍiṭṭe taganannu nelinām̐ḍu
monāna nidanimĕchchi mŏkkulu mŏkkevu