Enni semtaladaanave innidaa neevu

ఎన్ని చేఁతలదానవే ఇన్నిటా నీవు
Language

(॥పల్లవి॥)
ఎన్ని చేఁతలదానవే ఇన్నిటా నీవు
విన్న కన్న జాడ గాదు వెరగయ్యీ మాకు

(॥॥)
మొక్కి కొలువుసేసేవు ముందటనుండి పతితో
మక్కళించి మక్కళించి మాటలాడేవు
ఒక్కవచన్ను లొరయ సారెఁ బాదాలొత్తేవు
నిక్కి వలపులు చల్లనేరుతువే నీవు

(॥॥)
సెలవుల నవ్వేవు సిగ్గువడ కాతనితో
సొలసి సొలసి మేను సోఁకించేవు
తళుకుఁ జూపులఁ జూచి దండఁ గూచుండవచ్చేవు
యెలయింప జాణవైతి విపుడే నీవు

(॥॥)
కూరిమి శ్రీవేంకటేశుఁ గొనచూపులనుఁ జూచి
చేరి చేరి వూడిగాలు సేయవచ్చేవు
యీరీతి నన్నీతఁ డేలె యే నలమేల్మంగను
తారుకాణలాయ మంచిదానవే నీవు

(||pallavi||)
ĕnni sem̐taladānave inniḍā nīvu
vinna kanna jāḍa gādu vĕragayyī māgu

(||||)
mŏkki kŏluvusesevu muṁdaḍanuṁḍi padido
makkaḽiṁchi makkaḽiṁchi māḍalāḍevu
ŏkkavasannu lŏraya sārĕm̐ bādālŏttevu
nikki valabulu sallaneruduve nīvu

(||||)
sĕlavula navvevu sigguvaḍa kādanido
sŏlasi sŏlasi menu som̐kiṁchevu
taḽugum̐ jūbulam̐ jūsi daṁḍam̐ gūsuṁḍavachchevu
yĕlayiṁpa jāṇavaidi vibuḍe nīvu

(||||)
kūrimi śhrīveṁkaḍeśhum̐ gŏnasūbulanum̐ jūsi
seri seri vūḍigālu seyavachchevu
yīrīdi nannīdam̐ ḍelĕ ye nalamelmaṁganu
tārugāṇalāya maṁchidānave nīvu