Enni poligalagu nee viravaidivi

ఎన్ని పోలికలకు నీ విరవైతివి
Language

(॥పల్లవి॥)
ఎన్ని పోలికలకు నీ విరవైతివి
వన్నెల పెండ్లికొడుకువలె నుంటివి

(॥ఎన్ని॥)
పొలఁతులు నీవుఁ గూడి పువ్వుల వసంతమాడి
లలి సింగారపుఁ దోటవలె నుంటివి
బలువుగా నప్పటిని పన్నీట వసంతమాడి
తొలుకరికాలమువలె నుంటివి

(॥ఎన్ని॥)
కడలేనివేడుకతో కప్పుర వసంతమాడి
వడిఁ జుక్కలలో చంద్రునివలె నుంటివి
జడిగొని కుంకుమ వసంతములు సారెనాడి
గుడిగొని మాణిక్యాల కొండవలె నుంటివి

(॥ఎన్ని॥)
తిరముగ నీవు ముత్తెముల వసంతమాడి
వరుసఁ బాలజలధివలె నుంటివి
నిరతి శ్రీవేంకటేశ నీవు నలమేల్మంగయు
సురతవసంతమాడి సోనవలె నుంటివి

(||pallavi||)
ĕnni poligalagu nī viravaidivi
vannĕla pĕṁḍligŏḍuguvalĕ nuṁṭivi

(||ĕnni||)
pŏlam̐tulu nīvum̐ gūḍi puvvula vasaṁtamāḍi
lali siṁgārabum̐ doḍavalĕ nuṁṭivi
baluvugā nappaḍini pannīḍa vasaṁtamāḍi
tŏlugarigālamuvalĕ nuṁṭivi

(||ĕnni||)
kaḍaleniveḍugado kappura vasaṁtamāḍi
vaḍim̐ jukkalalo saṁdrunivalĕ nuṁṭivi
jaḍigŏni kuṁkuma vasaṁtamulu sārĕnāḍi
guḍigŏni māṇikyāla kŏṁḍavalĕ nuṁṭivi

(||ĕnni||)
tiramuga nīvu muttĕmula vasaṁtamāḍi
varusam̐ bālajaladhivalĕ nuṁṭivi
niradi śhrīveṁkaḍeśha nīvu nalamelmaṁgayu
suradavasaṁtamāḍi sonavalĕ nuṁṭivi