ఎన్ని నేరుచుకొంటివి యెంత వొడఁబరచేవు
(॥పల్లవి॥)
ఎన్ని నేరుచుకొంటివి యెంత వొడఁబరచేవు
నిన్నటనుంటి వింటి నీ మాటలే కావా
(॥ఎన్ని॥)
యెచ్చరించి యెచ్చరించి యెటువంటివారికైనా
మచ్చికె లూరించే వీ మాటలే కావా
పచ్చివొట్టు వెట్టుకొని పాసి వుండినవారి
నిచ్చకమై కలిపేవి యీ మాటలే కావా
(॥ఎన్ని॥)
తలపించి తలపించి తనివి దీరఁగనీక
మలసి నాటుకొనే వీ మాటలే కావా
చలపట్టినాఁ బోనీక సాదించి తెచ్చి కౌఁగిటి
కెలయించి తగిలించే వీ మాటలే కావా
(॥ఎన్ని॥)
కరఁగించి కరఁగించి కడుఁ జవులు వుట్టించి
మరిగించే విందరి కీ మాటలే కావా
నిరతి శ్రీవేంకటేశ నే నలమేల్మంగను
యిరవుగాఁ బెండ్లి సేసే వీ మాటలే కావా
(||pallavi||)
ĕnni nerusugŏṁṭivi yĕṁta vŏḍam̐barasevu
ninnaḍanuṁṭi viṁṭi nī māḍale kāvā
(||ĕnni||)
yĕchchariṁchi yĕchchariṁchi yĕḍuvaṁṭivārigainā
machchigĕ lūriṁche vī māḍale kāvā
pachchivŏṭṭu vĕṭṭugŏni pāsi vuṁḍinavāri
nichchagamai kalibevi yī māḍale kāvā
(||ĕnni||)
talabiṁchi talabiṁchi tanivi dīram̐ganīga
malasi nāḍugŏne vī māḍale kāvā
salabaṭṭinām̐ bonīga sādiṁchi tĕchchi kaum̐giḍi
kĕlayiṁchi tagiliṁche vī māḍale kāvā
(||ĕnni||)
karam̐giṁchi karam̐giṁchi kaḍum̐ javulu vuṭṭiṁchi
marigiṁche viṁdari kī māḍale kāvā
niradi śhrīveṁkaḍeśha ne nalamelmaṁganu
yiravugām̐ bĕṁḍli sese vī māḍale kāvā