Enni mahimalavaamde yee devumdu

ఎన్ని మహిమలవాఁడే యీ దేవుఁడు
Language

(॥పల్లవి॥)
ఎన్ని మహిమలవాఁడే యీ దేవుఁడు
కన్నులపండువ లెల్లాఁ గదిసిన ట్లుండెను

(॥ఎన్ని॥)
పోలింప కప్పురకాపు పురుషోత్తమునికి
యేలీల నుండునని యెంచి చూచితే
పాలజలనిధిలోనఁ బవ్వళింపఁగా మేన
మేలిమి మీ గడంటినమెలుపుతో నుండెను

(॥ఎన్ని॥)
తట్టుపుణుఁగుకాపు దైవశిఖామణికి
యెట్టుండెనని మఱి యెంచి చూచితే
చిట్టకాన రేపల్లెలోఁ జేసినరాసక్రీడల
నట్టే రాత్రులు మేన నంటినఁట్టుండెను

(॥ఎన్ని॥)
అలమేల్మంగతోడ నట్టె సొమ్ముధరించఁగా
యెలమి శ్రీవేంకటేశు నెంచి చూచితే
కలిమిగల యీ కొంత కౌఁగిటఁ బెనఁగఁగాను
నిలువెల్లా సిరులయి నిండినయ ట్లుండెనూ

(||pallavi||)
ĕnni mahimalavām̐ḍe yī devum̐ḍu
kannulabaṁḍuva lĕllām̐ gadisina ṭluṁḍĕnu

(||ĕnni||)
poliṁpa kappuragābu puruṣhottamunigi
yelīla nuṁḍunani yĕṁchi sūside
pālajalanidhilonam̐ bavvaḽiṁpam̐gā mena
melimi mī gaḍaṁṭinamĕlubudo nuṁḍĕnu

(||ĕnni||)
taṭṭubuṇum̐gugābu daivaśhikhāmaṇigi
yĕṭṭuṁḍĕnani maṟi yĕṁchi sūside
siṭṭagāna reballĕlom̐ jesinarāsakrīḍala
naṭṭe rātrulu mena naṁṭinam̐ṭṭuṁḍĕnu

(||ĕnni||)
alamelmaṁgadoḍa naṭṭĕ sŏmmudhariṁcham̐gā
yĕlami śhrīveṁkaḍeśhu nĕṁchi sūside
kalimigala yī kŏṁta kaum̐giḍam̐ bĕnam̐gam̐gānu
niluvĕllā sirulayi niṁḍinaya ṭluṁḍĕnū