ఎన్ని లేవు యీ యింద్రజాలములు యెట్టు నమ్మెడిది వో సర్వేశ్వర
(॥పల్లవి॥)
ఎన్ని లేవు యీ యింద్రజాలములు యెట్టు నమ్మెడిది వో సర్వేశ్వర
మన్నించి నన్నిటు బోధింపఁ గదవె మాయాతీతుఁడ విన్నిటను
(॥ఎన్ని॥)
తామసునకుఁ బుట్టిన సుజ్ఞానము తత్త్వవాదమునకే మొదలు
కాముకునకుఁ దోఁచిన వివేకము కాంతాళములకే శెల వవును
పామరునకుఁ బొడమిన వైరాగ్యము పరదూషణకే పని యవును
సామాన్యున కటు వచ్చిన చదువులు సాధింపవు మోక్షముతెరువు
(॥ఎన్ని॥)
జగతి నాస్తికున కొదవిన సత్యము శపథంబులకే గుఱి యౌను
మగటిమి దుర్జనుఁ డెఱిఁగిన మంత్రము మారణాదులకే సాధనము
పగటున లోభి యొనర్చిన పుణ్యము ప్రత్యవాయముల కాలయము
వెగటుఁన క్రూరుఁడు చేసిన తపమది వీరిడితనముల కాకరము
(॥ఎన్ని॥)
సరిఁ బాపికిఁ గల దాక్షిణ్యము జారచోరులకు సహాయము
విరసవర్తనున కాచార మబ్బిన విపరీతఁబులే దొరకొనును
దురితచిత్తునకుఁ జిక్కిన యుక్తులు తుచ్ఛంబులపాలుగఁ జేయు
చిరముగ శ్రీవేంకటేశ మిమ్ముఁగొలి చినవారలే యిల నతిఘనులు
(||pallavi||)
ĕnni levu yī yiṁdrajālamulu yĕṭṭu nammĕḍidi vo sarveśhvara
manniṁchi nanniḍu bodhiṁpam̐ gadavĕ māyādīdum̐ḍa vinniḍanu
(||ĕnni||)
tāmasunagum̐ buṭṭina sujñānamu tattvavādamunage mŏdalu
kāmugunagum̐ dom̐sina vivegamu kāṁtāḽamulage śhĕla vavunu
pāmarunagum̐ bŏḍamina vairāgyamu paradūṣhaṇage pani yavunu
sāmānyuna kaḍu vachchina saduvulu sādhiṁpavu mokṣhamudĕruvu
(||ĕnni||)
jagadi nāstiguna kŏdavina satyamu śhabathaṁbulage guṟi yaunu
magaḍimi durjanum̐ ḍĕṟim̐gina maṁtramu māraṇādulage sādhanamu
pagaḍuna lobhi yŏnarsina puṇyamu pratyavāyamula kālayamu
vĕgaḍum̐na krūrum̐ḍu sesina tabamadi vīriḍidanamula kāgaramu
(||ĕnni||)
sarim̐ bābigim̐ gala dākṣhiṇyamu jārasorulagu sahāyamu
virasavardanuna kāsāra mabbina vibarīdam̐bule dŏragŏnunu
duridasittunagum̐ jikkina yuktulu tuchchhaṁbulabālugam̐ jeyu
siramuga śhrīveṁkaḍeśha mimmum̐gŏli sinavārale yila nadighanulu