(॥పల్లవి॥)
ఎన్ని లేవు నేరము లిఁకనేల
నన్ను నిన్ను నెంచుకొని నవ్వఁగదవయ్యా
(॥ఎన్ని॥)
ఆసపడినయప్పుడు అన్నియును చవులౌను
వేసరుకొన్నప్పుడైతే విసుపౌను
రాసికెక్కినవలపు రంటికి వచ్చు నిప్పుడు
యీసులెల్లఁ దీరె నిఁక నింటికి రావయ్యా
(॥ఎన్ని॥)
దగ్గరి యేకతమైతే తమకించు నెందుకైనా
సిగ్గువడి ఇందరిలో చింతపుట్టును
నిగ్గులవయోమదము నీడా నెండావలె నుండు
యెగ్గు లెంచఁబనిలేదు ఇంటికి రావయ్యా
(॥ఎన్ని॥)
కూడఁగఁ గూడఁగ నట్టె కోరికలు కొనసాగు
వీడనాడఁబోతేను వింతపుట్టును
యీడనే నన్ను శ్రీవేంకటేశ కాగిలించితివి
యేడకు నేఁటికిని మా ఇంటికి రావయ్యా
(||pallavi||)
ĕnni levu neramu lim̐kanela
nannu ninnu nĕṁchugŏni navvam̐gadavayyā
(||ĕnni||)
āsabaḍinayappuḍu anniyunu savulaunu
vesarugŏnnappuḍaide visubaunu
rāsigĕkkinavalabu raṁṭigi vachchu nippuḍu
yīsulĕllam̐ dīrĕ nim̐ka niṁṭigi rāvayyā
(||ĕnni||)
daggari yegadamaide tamagiṁchu nĕṁdugainā
sigguvaḍi iṁdarilo siṁtabuṭṭunu
niggulavayomadamu nīḍā nĕṁḍāvalĕ nuṁḍu
yĕggu lĕṁcham̐baniledu iṁṭigi rāvayyā
(||ĕnni||)
kūḍam̐gam̐ gūḍam̐ga naṭṭĕ korigalu kŏnasāgu
vīḍanāḍam̐bodenu viṁtabuṭṭunu
yīḍane nannu śhrīveṁkaḍeśha kāgiliṁchidivi
yeḍagu nem̐ṭigini mā iṁṭigi rāvayyā