Enni jaanadanaalaade vemisese ninnaadamdu

ఎన్ని జాణతనాలాడే వేమిసేసె నిన్నాతఁడు
Language

(॥పల్లవి॥)
ఎన్ని జాణతనాలాడే వేమిసేసె నిన్నాతఁడు
నిన్ననే యాతఁడు నాకు నేరిపినాఁడనేవు

(॥ఎన్ని॥)
మెనసి నీపతివద్ద మోమేల వంచేవంటే
వెనుకొన్న నీకొప్పు వేఁగనేవు
మనసిచ్చి యాతనితో మాటలాడుమంటేను
తనరినమోవి మెత్తనిచిగురనేవు

(॥ఎన్ని॥)
సూటిగా నాతనిదిక్కు చూడరాదా యంటేను
వాఁటపుఁగనుఁగొనలు వాండ్లనేవు
నాఁటుకోన్న సెలవులనవ్వయినాఁ జూపుమంటే
యీటునఁ జెక్కులకాంతు లెండగాసీ ననేవు

(॥ఎన్ని॥)
యేలిన శ్రావేంకటేశు కెదిరి కాఁగిలిమ్మంటే
రాలవంటిచన్ను లొరసీననేవు
యీలీల నలమేల్‌మంగ యితఁడు గూడెనిమ్మంటే
వొలిఁ బెండ్లాడిననాఁడే వొద్దికైతిమనేవు

(||pallavi||)
ĕnni jāṇadanālāḍe vemisesĕ ninnādam̐ḍu
ninnane yādam̐ḍu nāgu neribinām̐ḍanevu

(||ĕnni||)
mĕnasi nībadivadda momela vaṁchevaṁṭe
vĕnugŏnna nīgŏppu vem̐ganevu
manasichchi yādanido māḍalāḍumaṁṭenu
tanarinamovi mĕttanisiguranevu

(||ĕnni||)
sūḍigā nādanidikku sūḍarādā yaṁṭenu
vām̐ṭabum̐ganum̐gŏnalu vāṁḍlanevu
nām̐ṭugonna sĕlavulanavvayinām̐ jūbumaṁṭe
yīḍunam̐ jĕkkulagāṁtu lĕṁḍagāsī nanevu

(||ĕnni||)
yelina śhrāveṁkaḍeśhu kĕdiri kām̐gilimmaṁṭe
rālavaṁṭisannu lŏrasīnanevu
yīlīla nalamel‌maṁga yidam̐ḍu gūḍĕnimmaṁṭe
vŏlim̐ bĕṁḍlāḍinanām̐ḍe vŏddigaidimanevu