Enni baasalu sesevu yela nammenu

ఎన్ని బాసలు సేసేవు యేల నమ్మేను
Language

(॥పల్లవి॥)
ఎన్ని బాసలు సేసేవు యేల నమ్మేను
అన్నియును నాయనాయ అప్పటి నామాటలు

(॥ఎన్ని॥)
నన్నుఁ బిలువఁగ నంపి నాకంటె మునుప నొక్కఁ
కన్నియ వచ్చిన నాపెఁ గైకొనేవు
యెన్నరానిటకాఁడ వేపాటిగలవాఁడవు
పన్ని యాచేతుల నీవు పట్టకుమీ నన్నును

(॥ఎన్ని॥)
నా కెదురు చూచిచూచి నడుము నొక్కతె వచ్చి
పైకొంటే నాపెమీఁదనే పరా కైతివి
ఈకొలఁదివాఁడవా నీ వింతలాబగాఁడవా
కాకుగా నాపచ్చడమే కప్పకుమీ నాకును

(॥ఎన్ని॥)
చిత్తము నామీదఁ బెట్టి చెవిలో నొక్కతె వచ్చి
వొత్తి విన్నవించితేను వొడఁబడేవు
యిత్తల శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
పొత్తులవలపు చల్లి పోకుమీ యిఁకను

(||pallavi||)
ĕnni bāsalu sesevu yela nammenu
anniyunu nāyanāya appaḍi nāmāḍalu

(||ĕnni||)
nannum̐ biluvam̐ga naṁpi nāgaṁṭĕ munuba nŏkkam̐
kanniya vachchina nābĕm̐ gaigŏnevu
yĕnnarāniḍagām̐ḍa vebāḍigalavām̐ḍavu
panni yāsedula nīvu paṭṭagumī nannunu

(||ĕnni||)
nā kĕduru sūsisūsi naḍumu nŏkkadĕ vachchi
paigŏṁṭe nābĕmīm̐dane parā kaidivi
īgŏlam̐divām̐ḍavā nī viṁtalābagām̐ḍavā
kāgugā nābachchaḍame kappagumī nāgunu

(||ĕnni||)
sittamu nāmīdam̐ bĕṭṭi sĕvilo nŏkkadĕ vachchi
vŏtti vinnaviṁchidenu vŏḍam̐baḍevu
yittala śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
pŏttulavalabu salli pogumī yim̐kanu