ఎన్నేసి వుపచారా లెంత సేసేరే నాకు
(॥పల్లవి॥)
ఎన్నేసి వుపచారా లెంత సేసేరే నాకు
మన్నించి యాతఁడు నాకు మగఁడాయ నిపుడు
(॥ఎన్నే॥)
అనిశముఁ జెప్పరప్ప ఆతని సుద్దులే నాకు
విన వేడుకయ్యీని వేమారును
వనితలాల నేను వలతు నాతనిని
నను మన్నించు నాతఁడు నంటుతోడను
(॥ఎన్నే॥)
వాడికతోఁ జూపరమ్మ వదల కాతని నాకు
చూడ వేడకాయ్యీని సొంపుగా నేఁడు
జాడతో నాతని పొందు సారె మరగిన దాన
యేడ నుండెయినా వచ్చి యెనయు నన్నతఁడు
(॥ఎన్నే॥)
పిలిచి తేగదరమ్మ బెరయు శ్రీవేంకటేశుఁ
గలయ వేడుకయ్యీ నా కాఁగిటఁ దెచ్చి
మెలుపున నాతనికి మేనమరఁదల నేను
బలువుగా నాపయిని బత్తిగలఁ డతఁడు
(||pallavi||)
ĕnnesi vubasārā lĕṁta sesere nāgu
manniṁchi yādam̐ḍu nāgu magam̐ḍāya nibuḍu
(||ĕnne||)
aniśhamum̐ jĕpparappa ādani suddule nāgu
vina veḍugayyīni vemārunu
vanidalāla nenu valadu nādanini
nanu manniṁchu nādam̐ḍu naṁṭudoḍanu
(||ĕnne||)
vāḍigadom̐ jūbaramma vadala kādani nāgu
sūḍa veḍagāyyīni sŏṁpugā nem̐ḍu
jāḍado nādani pŏṁdu sārĕ maragina dāna
yeḍa nuṁḍĕyinā vachchi yĕnayu nannadam̐ḍu
(||ĕnne||)
pilisi tegadaramma bĕrayu śhrīveṁkaḍeśhum̐
galaya veḍugayyī nā kām̐giḍam̐ dĕchchi
mĕlubuna nādanigi menamaram̐dala nenu
baluvugā nābayini battigalam̐ ḍadam̐ḍu