Ennesi semtulu sese vitte maganidonu

ఎన్నేసి చేఁతులు సేసే విట్టే మగనితోను
Language

(॥పల్లవి॥)
ఎన్నేసి చేఁతులు సేసే విట్టే మగనితోను
నన్నుఁ జూడవే మెప్పించే నయాన నీతనిని

(॥ఎన్నే॥)
పక్కన నేల మొక్కేవే పాదము లేల తొక్కేవే
చక్కని పతితో సరసము లాడుతూ
వెక్కసిం చేమి నవ్వేవే విరులనేల రువ్వేవే
తక్కక నీ తోంటిపొందు తలఁపించుకొంటాను

(॥ఎన్నే॥)
చందన మేమి వూసేవే చన్ను లేల రాసేవే
చెంది రమణునిసేవ సేసుకొంటాను
కందువ లేమి ముట్టేవే కానుక లేల పట్టేవే
సందడిలో వలపులు చల్లుకొంటాను

(॥ఎన్నే॥)
చేతు లేల చాఁచేవే సిగ్గు లేల రేఁచేనే
యీతల శ్రీవేంకటేశు నెనసుకొంటా
కాతర మేలపెంచేవే కాఁగిట నన్నితఁడేలె
పోతరిం చ్చాతనిబత్తి పొగడుకొంటాను

(||pallavi||)
ĕnnesi sem̐tulu sese viṭṭe maganidonu
nannum̐ jūḍave mĕppiṁche nayāna nīdanini

(||ĕnne||)
pakkana nela mŏkkeve pādamu lela tŏkkeve
sakkani padido sarasamu lāḍudū
vĕkkasiṁ semi navveve virulanela ruvveve
takkaga nī toṁṭibŏṁdu talam̐piṁchugŏṁṭānu

(||ĕnne||)
saṁdana memi vūseve sannu lela rāseve
sĕṁdi ramaṇuniseva sesugŏṁṭānu
kaṁduva lemi muṭṭeve kānuga lela paṭṭeve
saṁdaḍilo valabulu sallugŏṁṭānu

(||ĕnne||)
sedu lela sām̐seve siggu lela rem̐sene
yīdala śhrīveṁkaḍeśhu nĕnasugŏṁṭā
kādara melabĕṁcheve kām̐giḍa nannidam̐ḍelĕ
podariṁ schādanibatti pŏgaḍugŏṁṭānu