ఎన్నేసి చేఁతలు చేసీ నీపె నీముందరను
(॥పల్లవి॥)
ఎన్నేసి చేఁతలు చేసీ నీపె నీముందరను
సన్నలా చాయలా నీకు చవులు చూపీని
(॥ఎన్నే॥)
అతివ నీమోము చూచీ నదె చిత్తగించవయ్య
కతచెప్పీ వినవయ్య కమ్మటి నీవు
తతెరింగి బత్తిసేసీ తగిలి చేకొనవయ్య
మతిలో నీ యాసోదము మరినెంతగలదో
(॥ఎన్నే॥)
పొలఁతి నీముందరను పొలసీ నదిగోవయ్య
కొలువులు సేసీఁ జే కొనవయ్యా
సెలవుల నవ్వీని చేరి చనవియ్యవయ్యా
తలకొన్న వలపులు తనకెంత గలదో
(॥ఎన్నే॥)
దిసి కూచున్నది కాఁగిలించుకొనవయ్యా
వొదిగి రతుల నిట్టె బోగించవయ్యా
అదన నన్నేలితివి యన్నిటా శ్రీవేంకటేశ
పొతలిన యాపె తలపోఁత లెంతగలదో
(||pallavi||)
ĕnnesi sem̐talu sesī nībĕ nīmuṁdaranu
sannalā sāyalā nīgu savulu sūbīni
(||ĕnne||)
adiva nīmomu sūsī nadĕ sittagiṁchavayya
kadasĕppī vinavayya kammaḍi nīvu
tadĕriṁgi battisesī tagili segŏnavayya
madilo nī yāsodamu marinĕṁtagalado
(||ĕnne||)
pŏlam̐ti nīmuṁdaranu pŏlasī nadigovayya
kŏluvulu sesīm̐ je kŏnavayyā
sĕlavula navvīni seri sanaviyyavayyā
talagŏnna valabulu tanagĕṁta galado
(||ĕnne||)
disi kūsunnadi kām̐giliṁchugŏnavayyā
vŏdigi radula niṭṭĕ bogiṁchavayyā
adana nannelidivi yanniḍā śhrīveṁkaḍeśha
pŏdalina yābĕ talabom̐ta lĕṁtagalado