Ennennigunaala imtu lemdaru leru

ఎన్నెన్నిగుణాల ఇంతు లెందరు లేరు
Language

(॥పల్లవి॥)
ఎన్నెన్నిగుణాల ఇంతు లెందరు లేరు
సన్నతో నేలేవారికి జాణతన మింతేకాక

(॥॥)
రమణుని సేఁతలు రచ్చల వేసితేను
రమణి ఆది జగఱాఁగ గాక
సమరతి నాయకుని చాయకు రాకుండితేను
అమరిన చుట్టమా అతినిష్టూరి గాకా

(॥॥)
నగినందుకుఁ బతితో నాఁటఁ గోపించుకొంటేను
మగువా అది మంటమారి గాక
మగవాఁడు చెనకఁగా మాటలాడ కుండితేను
ముగుదా అది రొమ్మునఁ గుంపటే గాక

(॥॥)
సరసుఁడు పైకొనఁ గా చలము సాదించితేను
తరుణి అది నొకదయ్యము గాక
సిరి నేఁ డిచ్చ యెఱిఁగి శ్రీ వేంకటేశ్వరుఁగూడె
తెరచాటు వనితా దేవర గాకా

(||pallavi||)
ĕnnĕnniguṇāla iṁtu lĕṁdaru leru
sannado nelevārigi jāṇadana miṁtegāga

(||||)
ramaṇuni sem̐talu rachchala vesidenu
ramaṇi ādi jagaṟām̐ga gāga
samaradi nāyaguni sāyagu rāguṁḍidenu
amarina suṭṭamā adiniṣhṭūri gāgā

(||||)
naginaṁdugum̐ badido nām̐ṭam̐ gobiṁchugŏṁṭenu
maguvā adi maṁṭamāri gāga
magavām̐ḍu sĕnagam̐gā māḍalāḍa kuṁḍidenu
mugudā adi rŏmmunam̐ guṁpaḍe gāga

(||||)
sarasum̐ḍu paigŏnam̐ gā salamu sādiṁchidenu
taruṇi adi nŏgadayyamu gāga
siri nem̐ ḍichcha yĕṟim̐gi śhrī veṁkaḍeśhvarum̐gūḍĕ
tĕrasāḍu vanidā devara gāgā