ఎన్నెని చెప్పేమయా నీ యింతి సుద్దులు
(॥పల్లవి॥)
ఎన్నెని చెప్పేమయా నీ యింతి సుద్దులు
చెన్నగు నీ గుణాలెల్లఁ జెప్పుకొంటానున్నది
(॥ఎన్నె॥)
యెచ్చిన కోరికతోడ యెప్పుడు వత్తువోయంటా
కచ్చుపెట్టుకొని యాపె గాచుకున్నది
తచ్చి తచ్చి నీ పొందులే తలపోసుకొంటాను
ముచ్చటతో దేవరకే మొక్కుకొంటా నున్నది
(॥ఎన్నె॥)
మాఁగిన మోవి చూపి నీమతి గరఁగించేనంటా
కాఁగిటికి కంకణము గట్టుకున్నది
తోఁగుఁజెమటతో నిన్నుఁ దోడితెమ్మని చన్నుల -
వేఁగుతో నీ నెచ్చెలుల వేఁడుకొంటామన్నది
(॥ఎన్నె॥)
తేఁకువతో నిన్ను రతిఁ దెప్పలఁదేలించుదాఁకా
యేఁకటతో వయసు మీదెత్తుకున్నది
వీఁకతో నీ వేలఁగా శ్రీవేంకటేశ నీ గురుతు
వాఁకముగా నీ రూపే వాసుకొంటానున్నది
(||pallavi||)
ĕnnĕni sĕppemayā nī yiṁti suddulu
sĕnnagu nī guṇālĕllam̐ jĕppugŏṁṭānunnadi
(||ĕnnĕ||)
yĕchchina korigadoḍa yĕppuḍu vattuvoyaṁṭā
kachchubĕṭṭugŏni yābĕ gāsugunnadi
tachchi tachchi nī pŏṁdule talabosugŏṁṭānu
muchchaḍado devarage mŏkkugŏṁṭā nunnadi
(||ĕnnĕ||)
mām̐gina movi sūbi nīmadi garam̐giṁchenaṁṭā
kām̐giḍigi kaṁkaṇamu gaṭṭugunnadi
tom̐gum̐jĕmaḍado ninnum̐ doḍidĕmmani sannula -
vem̐gudo nī nĕchchĕlula vem̐ḍugŏṁṭāmannadi
(||ĕnnĕ||)
tem̐kuvado ninnu radim̐ dĕppalam̐deliṁchudām̐kā
yem̐kaḍado vayasu mīdĕttugunnadi
vīm̐kado nī velam̐gā śhrīveṁkaḍeśha nī gurudu
vām̐kamugā nī rūbe vāsugŏṁṭānunnadi