Ennatti(ti?) pomdo tanagu yerugalu sesee neegu

ఎన్నట్టి(టి?) పొందో తనకు యెరుకలు సేసీ నీకు
Language

(॥పల్లవి॥)
ఎన్నట్టి(టి?) పొందో తనకు యెరుకలు సేసీ నీకు
మున్నిటి వలపు నీవూ ముంచి చల్లవోయీ

(॥ఎన్న॥)
దొంతరపూవుల వేసీ తొయ్యలి మేడపైనుండి
వింత వింత మాఁటలాడీ వినవోయీ
పంతమున మోవి చూసి బయలు నోరూరించీ
సంతోసాలు నీకు రేఁచీఁ జవిగొనవోయీ

(॥ఎన్ను॥)
చిమ్మనఁ గోవులఁ జిమ్మి చేతఁ జూపీ బాగాలు
పమ్మి పచ్చడముకొంగు పట్టవోయి
కమ్మటిఁచెక్కుసన్నలు కానుకలు వట్టి నీకు
నమ్మికగా మోము చూచి నవ్వు నవ్వవోయీ

(॥ఎన్ను॥)
నిచ్చెన వేసుకవచ్చి నిన్ను వొడివట్టి తీసీ
కుచ్చి యాకెఁ గాఁగిలించుకొనవోయీ
యచ్చట శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
హెచ్చిన దేవులనని యిఁకఁ జెప్పవోయీ

(||pallavi||)
ĕnnaṭṭi(ṭi?) pŏṁdo tanagu yĕrugalu sesī nīgu
munniḍi valabu nīvū muṁchi sallavoyī

(||ĕnna||)
dŏṁtarabūvula vesī tŏyyali meḍabainuṁḍi
viṁta viṁta mām̐ṭalāḍī vinavoyī
paṁtamuna movi sūsi bayalu norūriṁchī
saṁtosālu nīgu rem̐sīm̐ javigŏnavoyī

(||ĕnnu||)
simmanam̐ govulam̐ jimmi sedam̐ jūbī bāgālu
pammi pachchaḍamugŏṁgu paṭṭavoyi
kammaḍim̐sĕkkusannalu kānugalu vaṭṭi nīgu
nammigagā momu sūsi navvu navvavoyī

(||ĕnnu||)
nichchĕna vesugavachchi ninnu vŏḍivaṭṭi tīsī
kuchchi yāgĕm̐ gām̐giliṁchugŏnavoyī
yachchaḍa śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
hĕchchina devulanani yim̐kam̐ jĕppavoyī