ఎన్నఁటి కెన్నఁటి పొందు యిస్సీ నేను
(॥పల్లవి॥)
ఎన్నఁటి కెన్నఁటి పొందు యిస్సీ నేను
ఎన్నుకొను నా మనసు యిస్సీ నేను
(॥ఎన్న॥)
కొంకక నీరాతి గుండె గుణ మెరిఁగుండియు
యింకా నిన్నుఁ గొసరే నిస్సీ నేను
వుంకువ వేరొకతెతో వుండఁగా నిన్నుఁ జూచియు
యింకవు నాకన్నీళ్లు యిస్సీ నేను
(॥ఎన్న॥)
మంతనాన నాడిననీమాఁట గల్లైవుండఁగాను
యెంతైనా మానఁగలేను యిస్సీ నేను
పంతాన నీవటుమోమై పరాకై వుండఁగాను
యెంతకెంత మాఁటలాడే నిస్సీ నేను
(॥ఎన్న॥)
తొప్పఁదోఁగి చమటల తొల్లిటినీబాగు చూచి
యిప్పుడె నేఁ గాఁగిలించే నిస్సీ నేను
అప్పుడె శ్రీవేంకటేశ ఆదరించి కూడితివి
యెప్పుడో మైమరచితి నిస్సీ నేను
(||pallavi||)
ĕnnam̐ṭi kĕnnam̐ṭi pŏṁdu yissī nenu
ĕnnugŏnu nā manasu yissī nenu
(||ĕnna||)
kŏṁkaga nīrādi guṁḍĕ guṇa mĕrim̐guṁḍiyu
yiṁkā ninnum̐ gŏsare nissī nenu
vuṁkuva verŏgadĕdo vuṁḍam̐gā ninnum̐ jūsiyu
yiṁkavu nāgannīḽlu yissī nenu
(||ĕnna||)
maṁtanāna nāḍinanīmām̐ṭa gallaivuṁḍam̐gānu
yĕṁtainā mānam̐galenu yissī nenu
paṁtāna nīvaḍumomai parāgai vuṁḍam̐gānu
yĕṁtagĕṁta mām̐ṭalāḍe nissī nenu
(||ĕnna||)
tŏppam̐dom̐gi samaḍala tŏlliḍinībāgu sūsi
yippuḍĕ nem̐ gām̐giliṁche nissī nenu
appuḍĕ śhrīveṁkaḍeśha ādariṁchi kūḍidivi
yĕppuḍo maimarasidi nissī nenu