ఎన్నఁడును నిట్టి వలపెఱఁగనమ్మ
(॥పల్లవి॥)
ఎన్నఁడును నిట్టి వలపెఱఁగనమ్మ
తన్నుఁ దానె పులకించి తనివందీని
(॥ఎన్నఁ॥)
పతిఁ జూచిచూచి తా పరవశమందె నీ
యతివ కన్నులనే మోహము చల్లీని
మతిలోనే కరఁగీని మలగుపై నొరగీని
రతులు దలఁచి నివ్వెరగువడీని
(॥ఎన్నఁ॥)
చిప్పిలుఁ బ్రియము లింతి చెలులతోఁ జెప్పీని
వుప్పతిల్లుఁగోరికలు నోలలాడీని
రెప్పలు ముయ్య నేరక రిచ్చవడి యిందరిలోఁ
జెప్పరాని కోరికలఁ జెంగలించీని
(॥ఎన్నఁ॥)
కమ్మరఁగమ్మరఁ దమకములెల్లఁ బెడరేఁచి
కొమ్మ దనయాసలెల్లఁ గుమ్మరించీని
సమ్మతై శ్రీవేంకటేశ్వరుఁడు గూడఁగ నిట్టె
చిమ్ముఁజెమటలచేత సేదదేరీని
(||pallavi||)
ĕnnam̐ḍunu niṭṭi valabĕṟam̐ganamma
tannum̐ dānĕ pulagiṁchi tanivaṁdīni
(||ĕnnam̐||)
padim̐ jūsisūsi tā paravaśhamaṁdĕ nī
yadiva kannulane mohamu sallīni
madilone karam̐gīni malagubai nŏragīni
radulu dalam̐si nivvĕraguvaḍīni
(||ĕnnam̐||)
sippilum̐ briyamu liṁti sĕluladom̐ jĕppīni
vuppadillum̐gorigalu nolalāḍīni
rĕppalu muyya neraga richchavaḍi yiṁdarilom̐
jĕpparāni korigalam̐ jĕṁgaliṁchīni
(||ĕnnam̐||)
kammaram̐gammaram̐ damagamulĕllam̐ bĕḍarem̐si
kŏmma danayāsalĕllam̐ gummariṁchīni
sammadai śhrīveṁkaḍeśhvarum̐ḍu gūḍam̐ga niṭṭĕ
simmum̐jĕmaḍalaseda sedaderīni