Ennamdu nerusugomti viduvamti vedugalu

ఎన్నఁడు నేరుచుకొంటి విటువంటి వేడుకలు
Language

(॥పల్లవి॥)
ఎన్నఁడు నేరుచుకొంటి విటువంటి వేడుకలు
అన్నిటా నీ సుద్దులు యెంతని మెచ్చేమమ్మా

(॥ఎన్నఁ॥)
పచ్చిదేరె జంకెనలపై పూఁతలు
తచ్చన మరఁగుల పాదపు వాఁతలు
కుచ్చియెత్తె గోరి చెనకుల చేఁతలు
హెచ్చి నీవిభునివద్ద నేమి చూపేవమ్మా

(॥ఎన్నఁ॥)
పొరుగు పోరచి సొలపుల తక్కులు
గరువముతోడి కనుఁగవ మొక్కులు
సరసపు మాఁటల బచ్చన తెక్కులు
అరుదుగా నీ కిన్నియు నమరె నోయమ్మా

(॥ఎన్నఁ॥)
తనిసినన నవ్వులతో తరితీపులు
చినుకుఁ జెమట చెక్కుచేతి దాపులు
ఘనశ్రీవేంకటేశు రేఁచిన రేఁపులు
యనసిన యతనితో నివి దగునమ్మా

(||pallavi||)
ĕnnam̐ḍu nerusugŏṁṭi viḍuvaṁṭi veḍugalu
anniḍā nī suddulu yĕṁtani mĕchchemammā

(||ĕnnam̐||)
pachchiderĕ jaṁkĕnalabai pūm̐talu
tachchana maram̐gula pādabu vām̐talu
kuchchiyĕttĕ gori sĕnagula sem̐talu
hĕchchi nīvibhunivadda nemi sūbevammā

(||ĕnnam̐||)
pŏrugu porasi sŏlabula takkulu
garuvamudoḍi kanum̐gava mŏkkulu
sarasabu mām̐ṭala bachchana tĕkkulu
arudugā nī kinniyu namarĕ noyammā

(||ĕnnam̐||)
tanisinana navvulado taridībulu
sinugum̐ jĕmaḍa sĕkkusedi dābulu
ghanaśhrīveṁkaḍeśhu rem̐sina rem̐pulu
yanasina yadanido nivi dagunammā