Ennamdu nerusugomti veesemtalu

ఎన్నఁడు నేరుచుకొంటి వీచేఁతలు
Language

(॥పల్లవి॥)
ఎన్నఁడు నేరుచుకొంటి వీచేఁతలు
సన్నల చాయల నేల చవులు రేఁచేవే

(॥ఎన్న॥)
పెదవిపై తములముబేఁటులు రాలఁగాను
యెదిరించి పతితోడ నేమినవ్వేవే
వదలుఁబయ్యదతోడ వాసనచేమట గార
సదరాననే యెంత సరసమాడేవే

(॥ఎన్న॥)
చెక్కులవెంటను పెఁజెమటలు గారఁగాను
మక్కువతో నేడకేడ మాటలాడేవే
నిక్కినిక్కి చూచేకొంటా నివ్వెరగు నొందుకుంటా
మక్కళించి పతినెంత మరిగించేవే

(॥ఎన్న॥)
చలిమీ బలిమీ నిట్టె చన్నుల నొరసుకొంటా
కలికితనాల నెంత కరఁగించేవే
అలమేలుమంగను నే నతఁడు శ్రీవేంకటేశుఁ-
డెలమి నన్నేలినాఁడు యిఁక నేమనేవే

(||pallavi||)
ĕnnam̐ḍu nerusugŏṁṭi vīsem̐talu
sannala sāyala nela savulu rem̐seve

(||ĕnna||)
pĕdavibai tamulamubem̐ṭulu rālam̐gānu
yĕdiriṁchi padidoḍa neminavveve
vadalum̐bayyadadoḍa vāsanasemaḍa gāra
sadarānane yĕṁta sarasamāḍeve

(||ĕnna||)
sĕkkulavĕṁṭanu pĕm̐jĕmaḍalu gāram̐gānu
makkuvado neḍageḍa māḍalāḍeve
nikkinikki sūsegŏṁṭā nivvĕragu nŏṁduguṁṭā
makkaḽiṁchi padinĕṁta marigiṁcheve

(||ĕnna||)
salimī balimī niṭṭĕ sannula nŏrasugŏṁṭā
kaligidanāla nĕṁta karam̐giṁcheve
alamelumaṁganu ne nadam̐ḍu śhrīveṁkaḍeśhum̐-
ḍĕlami nannelinām̐ḍu yim̐ka nemaneve