ఎన్నఁడు నేరిచితివే యీ చేఁతలు
(॥పల్లవి॥)
ఎన్నఁడు నేరిచితివే యీ చేఁతలు
నిన్నఁ గుప్ప నేఁడాళ్ళు నీ వెంత సేసేవే
(॥ఎన్న॥)
కూడఁగొప్పుదువ్వెనంటా కుచములు దాఁకించి
యేడలేని యాసలాను యేల పెట్టేవే
వీడెపుమోవి చూపి వింతమాటల్లానాడి
వాడికలఁబతి నెంత వలలఁ బెట్టేవే
(॥ఎన్న॥)
పాదాలు గుద్దెనంటా పయ్యద జారఁదోసి
యీదెస నీతని కెంతయింపు రేచేవే
పోదిగా సన్నలు సేసి పోందుగా నో రూరించి
పాదుకొని మోహ మెంత పైజల్లేవే
(॥ఎన్న॥)
కతలు చెప్పేనంటా గక్కనఁ దెరవేసుక
పతి శ్రీవేంకటేశు నెందాఁకాఁగూడేవే
రతి నన్ను నేలినాఁడు రచ్చలోన నిప్పు డిట్టె
మతకమున నీ వెంతమలయవచ్చేవే
(||pallavi||)
ĕnnam̐ḍu nerisidive yī sem̐talu
ninnam̐ guppa nem̐ḍāḽḽu nī vĕṁta seseve
(||ĕnna||)
kūḍam̐gŏppuduvvĕnaṁṭā kusamulu dām̐kiṁchi
yeḍaleni yāsalānu yela pĕṭṭeve
vīḍĕbumovi sūbi viṁtamāḍallānāḍi
vāḍigalam̐badi nĕṁta valalam̐ bĕṭṭeve
(||ĕnna||)
pādālu guddĕnaṁṭā payyada jāram̐dosi
yīdĕsa nīdani kĕṁtayiṁpu reseve
podigā sannalu sesi poṁdugā no rūriṁchi
pādugŏni moha mĕṁta paijalleve
(||ĕnna||)
kadalu sĕppenaṁṭā gakkanam̐ dĕravesuga
padi śhrīveṁkaḍeśhu nĕṁdām̐kām̐gūḍeve
radi nannu nelinām̐ḍu rachchalona nippu ḍiṭṭĕ
madagamuna nī vĕṁtamalayavachcheve