ఎన్నఁడు నెఱఁగము మీకిటువంటివి
(॥పల్లవి॥)
ఎన్నఁడు నెఱఁగము మీకిటువంటివి
మన్ననలు నించేవు మరి యేలో కాని
(॥ఎన్న॥)
చెలియ చెక్కిటిచేయి చేత నీవు పట్టితీసి
యెలమి వేఁడుకొంటివి యేఁటికో కాని
పలుకకుండఁగ నీవు బలిమిఁ జెక్కులు నొక్కి
అలుకలు దేరిచేవు అదియేమో కాని
(॥ఎన్న॥)
ముసుగు వెట్టుకుండఁగ మొగమిట్టే తొంగిచూచి
యెసఁగి యాసలు వెట్టేవేఁటికో కాని
వుసురంటా మలఁగుపై నొరగి యుండినదాని
పిసికేవు చన్నులు నీప్రియమెంతో కాని
(॥ఎన్న॥)
కన్నులు మూసుకుండఁగాఁ గాఁగిలించి తెరపించి
యెన్నికగా నవ్వించితి వేఁటికో కాని
సన్నల శ్రీవేంకటేశ సరసములాడఁగాను
యెన్నేసి మెచ్చులు మెచ్చేవింపులెట్టో కాని
(||pallavi||)
ĕnnam̐ḍu nĕṟam̐gamu mīgiḍuvaṁṭivi
mannanalu niṁchevu mari yelo kāni
(||ĕnna||)
sĕliya sĕkkiḍiseyi seda nīvu paṭṭidīsi
yĕlami vem̐ḍugŏṁṭivi yem̐ṭigo kāni
palugaguṁḍam̐ga nīvu balimim̐ jĕkkulu nŏkki
alugalu derisevu adiyemo kāni
(||ĕnna||)
musugu vĕṭṭuguṁḍam̐ga mŏgamiṭṭe tŏṁgisūsi
yĕsam̐gi yāsalu vĕṭṭevem̐ṭigo kāni
vusuraṁṭā malam̐gubai nŏragi yuṁḍinadāni
pisigevu sannulu nīpriyamĕṁto kāni
(||ĕnna||)
kannulu mūsuguṁḍam̐gām̐ gām̐giliṁchi tĕrabiṁchi
yĕnnigagā navviṁchidi vem̐ṭigo kāni
sannala śhrīveṁkaḍeśha sarasamulāḍam̐gānu
yĕnnesi mĕchchulu mĕchcheviṁpulĕṭṭo kāni