Ennamdu neṟamgamayya yiduvamti valabulu

ఎన్నఁడు నెఱఁగమయ్య యిటువంటి వలపులు
Language

(॥పల్లవి॥)
ఎన్నఁడు నెఱఁగమయ్య యిటువంటి వలపులు
విన్న కన్న వారికెల్లా వెరగయ్యీ నిపుడు

(॥ఎన్నఁ॥)
వెలఁది నీగుణములు వినివిని తనియదు
తలపోసి తలపోసి తనియదు
సొలసి కన్నుల నిన్నుఁ జూచి చూచి తనియదు
యెలమి నీపై మోహ మింకా వెంతోకాని

(॥ఎన్నఁ॥)
అట్టె నీతోడుత మాటలాడియాడి తనియదు
తట్టి తట్టి పాదాలొత్తి తనియదు
చిట్టకపు కొనగోరఁ జిమ్మి చిమ్మి తనియదు
యిట్టె నిన్నుఁ గూడే వేడు కింకా నెంతోకాని

(॥ఎన్నఁ॥)
అచ్చపు నీమోవితేనె లానియాని తనియదు
తచ్చి తచ్చి నవ్వి నవ్వి తనియదు
కొచ్చి శ్రీవేంకటేశ్వర కూడిమాడి తనియదు
యిచ్చల నీపై తమక మింకా నెంతో కాని

(||pallavi||)
ĕnnam̐ḍu nĕṟam̐gamayya yiḍuvaṁṭi valabulu
vinna kanna vārigĕllā vĕragayyī nibuḍu

(||ĕnnam̐||)
vĕlam̐di nīguṇamulu vinivini taniyadu
talabosi talabosi taniyadu
sŏlasi kannula ninnum̐ jūsi sūsi taniyadu
yĕlami nībai moha miṁkā vĕṁtogāni

(||ĕnnam̐||)
aṭṭĕ nīdoḍuda māḍalāḍiyāḍi taniyadu
taṭṭi taṭṭi pādālŏtti taniyadu
siṭṭagabu kŏnagoram̐ jimmi simmi taniyadu
yiṭṭĕ ninnum̐ gūḍe veḍu kiṁkā nĕṁtogāni

(||ĕnnam̐||)
achchabu nīmovidenĕ lāniyāni taniyadu
tachchi tachchi navvi navvi taniyadu
kŏchchi śhrīveṁkaḍeśhvara kūḍimāḍi taniyadu
yichchala nībai tamaga miṁkā nĕṁto kāni