Ennamdu neṟamgamammaa yiduvamti kottalu

ఎన్నఁడు నెఱఁగమమ్మా యిటువంటి కొత్తలు
Language

(॥పల్లవి॥)
ఎన్నఁడు నెఱఁగమమ్మా యిటువంటి కొత్తలు
కన్నె ముద్దరాలో కాక కాంతుని మోహనమో

(॥ఎన్నఁ॥)
హరి చెక్కటద్దములయందుఁ దనరూపు చూచి
పరసతిఁ దెచ్చెనంటాఁ బతి దూరీని
అరుదుగఁ దానే నవ్వి యాకె గందవొడి చల్లె
సరివచ్చె నిదియంటా జంకించె బొమ్మలము

(॥ఎన్నఁ॥)
పతి కంఠమునఁ జంద్రాభరణము వెట్టి యే
సతి చంద్దవంకలంటా సాదించిని
తతిఁ దనచూపులందుఁ దామెరలై నిండితేను
రతి నాకె వేశెనంటా రమణుని దూరెను

(॥ఎన్నఁ॥)
కాంతుని కాఁగిటఁ దనకమ్మవాస నంటితేను
వింతవాస నేడదంటా వెరగందెను
యింతట నా శ్రీవేంకటేశుఁ డన్నీఁదెలుపగా
చెంత నలమేలుమంగ చేకొని తా నమ్మెను

(||pallavi||)
ĕnnam̐ḍu nĕṟam̐gamammā yiḍuvaṁṭi kŏttalu
kannĕ muddarālo kāga kāṁtuni mohanamo

(||ĕnnam̐||)
hari sĕkkaḍaddamulayaṁdum̐ danarūbu sūsi
parasadim̐ dĕchchĕnaṁṭām̐ badi dūrīni
arudugam̐ dāne navvi yāgĕ gaṁdavŏḍi sallĕ
sarivachchĕ nidiyaṁṭā jaṁkiṁchĕ bŏmmalamu

(||ĕnnam̐||)
padi kaṁṭhamunam̐ jaṁdrābharaṇamu vĕṭṭi ye
sadi saṁddavaṁkalaṁṭā sādiṁchini
tadim̐ danasūbulaṁdum̐ dāmĕralai niṁḍidenu
radi nāgĕ veśhĕnaṁṭā ramaṇuni dūrĕnu

(||ĕnnam̐||)
kāṁtuni kām̐giḍam̐ danagammavāsa naṁṭidenu
viṁtavāsa neḍadaṁṭā vĕragaṁdĕnu
yiṁtaḍa nā śhrīveṁkaḍeśhum̐ ḍannīm̐dĕlubagā
sĕṁta nalamelumaṁga segŏni tā nammĕnu